KGF movie released in Telugu by Kaikala Satyanarayana
KGF : ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ సుస్థిరస్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. 60 ఏళ్ళ సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలతో దాదాపు 700 పైగా సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప పాత్రల్లో నటించి మెప్పించారు.
నటుడిగానే కాక కైకాల సత్యనారాయణ గతంలో రమా ఫిలింస్ అనే బ్యానర్ స్థాపించి కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. అనంతరం కైకాల తర్వాత ఆయన వారసుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన కన్నడలో కొన్ని సినిమాలకి సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్ 1’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పని చేశారు.
Kaikala Satyanarayana : పూజాహెగ్డేకి తాతగా.. కైకాల చివరి సినిమా..
‘కేజీఎఫ్ 1’ సినిమా అవుట్ ఫుట్ చూసి హిట్ అవుతుందని భావించి కైకాల సత్యనారాయణకు సినిమా గురించి చెప్పి తెలుగులో రిలీజ్ చేద్దామని అడిగారు. కైకాల సత్యనారాయణ ఓకే అనడంతో మరో నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రంతో కలిసి KGF సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు వర్షన్ లో టైటిల్స్ కంటే ముందే కైకాల సత్యనారాయణ సమర్పించు అని పడుతుంది. అలా కేజీఎఫ్ ని తెలుగులో కైకాల సత్యనారాయణ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. KGF సినిమా రిలీజ్ సమయంలోనే కేజీఎఫ్ యూనిట్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కైకాల సత్యనారాయణకు సన్మానం కూడా చేసింది.