యశ్‌కి చిన్న యశ్ పుట్టాడు!

‘కేజీఎఫ్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాక్ స్టార్ యశ్‌ భార్య రాధికా పండిట్‌ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు..

  • Publish Date - October 30, 2019 / 07:27 AM IST

‘కేజీఎఫ్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాక్ స్టార్ యశ్‌ భార్య రాధికా పండిట్‌ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు..

‘కేజీఎఫ్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాక్ స్టార్ యశ్‌ రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య, హీరోయిన్‌ రాధికా పండిట్‌ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బుధవారం (అక్టోబర్ 30) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

ఈ సందర్భంగా ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా యశ్ కపుల్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ‘యశ్‌కి చిన్న యశ్ పుట్టాడు’, ‘జూనియర్‌ యశ్‌ వచ్చేశాడు’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఐరా(11 నెలలు) అనే పాప ఉంది.

Read Also : ‘పాదయోట్టం’ రీమేక్‌లో సుమంత్

‘మొగ్గిన మనసు’, ‘Mr. and Mrs. రామాచారి’, ‘సంతు స్ట్రైట్ ఫార్వార్డ్’, ‘డ్రామా’ వంటి సినిమాల్లో కలిసి నటించిన యశ్, రాధికా 2016 మ్యారేజ్ చేసుకున్నారు.
ప్రస్తుతం ‘కేజీఎఫ్‌-2’లో నటిస్తున్నాడు యశ్.