Kiara Advani roped for NTR and Hrithik Roshan War 2 movie
Kiara Advani – War 2 : బాలీవుడ్ లో త్వరలో ప్రారంభమయ్యే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘వార్ 2’. గతంలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మెయిన్ లీడ్ లో మరో బి టౌన్ స్టార్ టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) ప్రధాన పాత్రలో నటించిన సినిమా వార్. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2019 లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించారు. కాగా ఇటీవల ఈ నిర్మాణ సంస్థ పఠాన్ చిత్రంతో ఒక స్పై సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
NTR : బాబోయ్ ఒక యాడ్ చేయడానికి ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..!
ఈ యూనివర్స్ లో భాగంగా వార్ మూవీకి సీక్వెల్ ని తీసుకు రాబోతున్నారు నిర్మాతలు. ఇటీవలే వార్ 2 ని ప్రకటించిన మేకర్స్.. ఈ చిత్రంలో హృతిక్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ని (NTR) కూడా క్యాస్ట్ చేసుకున్నారు. ఒక ముఖ్య పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ పై సౌత్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలోకి ఇప్పుడు కియారా అద్వానీ కూడా ఎంట్రీ ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది నవంబర్ లో మొదలు కానున్నదని కూడా రాసుకొస్తున్నారు.
NTR – Ram Charan : ఎన్టీఆర్ అండ్ చరణ్ తో కలిసి నటించడం అదృష్టం అంటున్న థోర్..
అయితే వీటి పై మూవీ టీం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ దర్శకుడు ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాతో సౌత్ ఆడియన్స్ ని కూడా పలకరించాడు. ఈ వార్ 2 చిత్రం.. స్పై యూనివర్స్ లో వస్తున్న మరో మూవీ టైగర్ 3 కి కొనసాగింపుగా రాబోతుంది. సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న టైగర్ 3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.