Kiara Advani to Anjali Aishwarya Rajesh all Sankranthi Movies Actresses Waiting for Their Career Growth in Telugu Industry
Sankranthi Movies Heroines : ఈ సంక్రాంతి చాలా మందికి కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. హీరోలకే కాదు హీరోయిన్లకి కూడా ఇది టఫ్ ఎగ్జామ్ అవ్వబోతోంది. ఇప్పటికే బిజీగా సినిమాలుచేస్తున్నా తెలుగులో క్రేజ్ ఉన్నా స్టార్ హోదా మాత్రం అందుకోలేకపోయారు ఈ సంక్రాంతి హీరోయిన్లు. ఈ సంక్రాంతి కోసం బాలీవుడ్ భామ కియారా దగ్గర నుంచి అచ్చతెలుగు హీరోయిన్ ఐశ్వర్య, అంజలి వరకూ వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి టాలీవుడ్ లో తమ కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. ఈ సినిమాల రిజల్ట్ ని బట్టే తెలుగులో ఎలాంటి కెరీర్ ఉండబోతోందో తేలిపోతుంది.
సంక్రాంతికి రిలీజవుతున్న గేమ్ ఛేంజర్ లో ఇద్దరు హీరోయిన్లున్నారు. ఒకటి అప్పన్న క్యారెక్టర్ కి అంజలి అయితే, మరొకటి యంగ్ వర్షన్ రామ్ చరణ్ కి కియారా. ఈ ఇద్దరు హీరోయిన్లకి ఈ సినిమా క్రూషియల్ కాబోతోంది. ఎందుకంటే అంజలి ఎప్పటినుంచో తెలుగు సినిమాల్లో ఉన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ గేమ్ ఛేంజర్ తో గ్యారంటీగా ఆ గుర్తింపు వస్తుందని, సినిమాకే తన క్యారెక్టర్ హైలైట్ అవుతుందని అంచనా వేస్తుంది. శంకర్ అయితే ఏకంగా నేషనల్ అవార్డ్ వస్తుందని కూడా అన్నారట. మరి ఈ రేంజ్ యాక్టింగ్ చేసిన అంజలికి మళ్లీ తెలుగులో అవకాశాలు రావాలన్నా బిజీ అవ్వాలన్నా గేమ్ ఛేంజర్ మూవీ హిట్ అయ్యి తీరాల్సిందే.
Also Read : Renu Desai : ఒక్క ఫొటో మీద ఇంత మంచి కథ.. క్లైమాక్స్ చూసి ఏడ్చేసాను.. 1000 వర్డ్స్ సినిమాపై రేణుదేశాయ్..
గేమ్ ఛేంజర్ లో మెయిన్ లీడ్ హీరోయిన్ గా ఉన్న కియారా అద్వానీ కూడా 2019లో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ తెలుగులో సినిమా ఆలోచనే చెయ్యలేదు కియారా. బట్ ఇప్పుడు తెలుగు సినిమా స్పాన్ మారింది. స్టామినా మారింది. అందుకే గేమ్ ఛేంజర్ హిట్ అయితే టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆఫర్లతో బిజీ అవ్వొచ్చని ఊహిస్తుంది కియారా.
మరో సంక్రాంతి మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’లో కూడా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఇద్దరు హీరోయిన్లున్నారు. వీళ్లిద్దరిలో మీనాక్షి అయితే లాస్ట్ ఇయర్ 6 సినిమాలు రిలీజ్ చేసింది. అందులో మ్యాగ్జిమమ్ హిట్ సినిమాలే. హిట్ సినిమాలు వచ్చినా ఇంకా స్టార్ హీరోయిన్ హోదా రాలేదు. ఈ సినిమాతో వస్తుందేమో చూడాలి.
Also See : Maanasa Choudhary : బబుల్ గమ్ హీరోయిన్ మానస చౌదరి స్టైలిష్ లుక్స్ చూశారా?
ఇక తెలుగు హీరోయిన్ అయినా తమిళ్ లో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తెలుగు వాళ్లని పలకరిస్తున్న ఐశ్వర్య రాజేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ కి భార్యగా నటిస్తోంది. స్టార్ హీరో పక్కన, మంచి సీజన్, భారీ అంచనాలు ఉన్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయితే తెలుగులో కూడా ఐశ్వర్య బిజీ అయిపోవడం ఖాయం.
ఇక బాలయ్య సినిమా డాకు మహరాజ్ లో హీరోయిన్స్ గా ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నారు. శ్రద్ధ అడపాదడపా తెలుగు సినిమాల్లో నటిస్తున్నా స్టార్ హీరోయిన్ గా అయితే పేరు తెచ్చుకోలేదు. ఇక ప్రగ్య జైస్వాల్ అయితే ఎప్పుడో ఒకసారి తెలుగులో కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్ కాదు కదా వరుస తెలుగు సినిమాలు కూడా రావట్లేదు. మరి డాకు మహారాజ్ తర్వాత అయిన ఈ ఇద్దరూ తెలుగులో బిజీ అవుతారేమో చూడాలి. హీరోయిన్స్ అంతా ఈ సంక్రాంతి వైపే ఆశగా చూస్తున్నారు.