Renu Desai : ఒక్క ఫొటో మీద ఇంత మంచి కథ.. క్లైమాక్స్ చూసి ఏడ్చేసాను.. 1000 వర్డ్స్ సినిమాపై రేణుదేశాయ్..
తాజాగా 1000 వర్డ్స్ సినిమా టీజర్ రిలీజ్ చేసి, సినిమా స్పెషల్ ప్రీమియర్ కూడా వేశారు.

Renu Desai Attends to Arvind Krishna 1000 Words Movie Premiere Show
Renu Desai : అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘1000 వర్డ్స్’. విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై రమణ విల్లర్ట్ నిర్మాతగా, దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నేపథ్య సంగీతం మ్యాస్ట్రో పీవీఆర్ రాజా అందించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి, సినిమా స్పెషల్ ప్రీమియర్ కూడా వేశారు. ఈ ఈవెంట్ కు రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్.. పలువురు అతిథులుగా వచ్చారు.
ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఓ ఫోటోగ్రాఫర్ కథ, అతని ప్రేమ కథ అని తెలుస్తుంది. అలాగే ఓ కెమెరా చుట్టూ, ప్రకృతి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది. మీరు కూడా 1000 వర్డ్స్ ట్రైలర్ చూసేయండి..
సినిమా చూసిన తర్వాత రేణు దేశాయ్ మాట్లాడుతూ.. రమణ గారు నాకు ఫోటోగ్రాఫర్‌గా తెలుసు. ఆయన నాకు చెప్పిన కథ ఎలా తీసారా అనుకున్నాను. ఈ సినిమా చూశాక ఇది అందరూ చూడాల్సిన సినిమా అనిపించింది. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకున్నారు. క్లైమాక్స్ చూశాక నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇంత మంచి సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. ‘1000 వర్డ్స్’ సినిమాలో నటించడం నా అదృష్టం. రమణ గారితో ఓ సారి ఫోటో షూట్ చేశాను. ఎప్పుడైనా సినిమా చేస్తే నాకు చెప్పండి అన్నాను. ఆయన గుర్తుంచుకొని నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఏ మాస్టర్ పీస్ సినిమా సమయంలో నాకు గాయమైంది. ఎనిమిది నెలలు పని లేకుండా బెడ్ మీదే ఉన్నాను. ఆ టైంలోనే దేవుడే రమణ గారిని నా దగ్గరకు పంపాడనిపిస్తుంది. నా మూడేళ్ల కొడుకు అధ్విక్ కృష్ణ మొదటి సారిగా నా సినిమాను స్క్రీన్ మీద చూశాడు. ఈ మూవీ నాకెంతో స్పెషల్ అని తెలిపారు.
Also See : తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగట్లేదు.. డాకు మహారాజ్ టికెట్ రేట్లపై నిర్మాత కామెంట్స్..
ఇక దర్శక నిర్మాత రమణ విల్లర్ట్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా నేను ఓ మంచి సినిమా చేయాలని అనుకుంటున్నాను. నాకు కథలు రాయడం రాదు. సంకల్ప్ ఈ కథతో వచ్చారు. ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. అరకులో షూటింగ్ చేశాం. ఈ కథను అరవింద్ గారికి చెప్తే వెంటనే ఒప్పుకున్నారు. దివి చాలా అందంగా ఉండటమే కాదు అద్భుతంగా నటించారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అద్భుతంగా పాట రాశారు. సినిమాటోగ్రఫర్ శివ రామ్ చరణ్ ఫ్రేమ్స్ అద్భుతంగా అనిపించింది. ఓ ఫోటోగ్రాఫర్‌కు నచ్చేలా సినిమాటోగ్రఫర్ పని చేయడం మామూలు విషయం కాదు. సంకల్ప్ నాకు ఎన్ని వర్షెన్స్ కావాలంటే అన్ని వర్షెన్స్ రాసి ఇచ్చాడు. రేణూ దేశాయ్ నాకు సోదరి లాంటి వారు. ఆమె ఈ కథ విని ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తానని అన్నారని తెలిపారు.
దివి మాట్లాడుతూ.. నన్ను ఇంత అందంగా చూపించిన రమణ గారికి థాంక్స్. సినిమా చివరి పది నిమిషాలు హృదయాన్ని హత్తుకుంది. అందరినీ ఈ మూవీ మెప్పిస్తుంది. తెరపై అలా చూస్తుంటే తల్లి మాతృత్వాన్ని ఫీల్ అయ్యాను అని తెలిపింది.