Director Bobby : అక్కడ అంత డ్రామా జరగలేదు.. అనవసరంగా పెద్దది చేస్తున్నారు.. ఎన్టీఆర్ – బాలయ్య వివాదంపై బాబీ కామెంట్స్..
డైరెక్టర్ బాబీ ఈ వివాదం గురించి స్పందిస్తూ..

Director Bobby Gives Clarity on Balakrishna NTR Issue Regarding Unstoppable Show
Director Bobby : ఇటీవల బాలయ్య(Balakrishna) – ఎన్టీఆర్(NTR) మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ పేరు కూడా బాలయ్య ప్రస్తావించకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో కూడా అందరి హీరోల గురించి అడుగుతున్నా ఎన్టీఆర్ గురించి మాత్రం అడగట్లేదని, ఇటీవల డైరెక్టర్ బాబీ షోకి రాగా అతను పనిచేసిన హీరోలందరి గురించి అడిగి ఎన్టీఆర్ గురించి అడగకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యని, డైరెక్టర్ బాబీని విమర్శిస్తూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
Also Read : Ajith : రేసింగ్ చేస్తుండగా స్టార్ హీరో కార్ కు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..
ఇప్పటికే దీనిపై నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తాజాగా నేడు డాకు మహారాజ్ ప్రెస్ మీట్ జరగ్గా ఈ ఇష్యూ గురించి అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ ఫొటో చూపించి ఎడిటింగ్ లో తీసేసారా, మిమ్మల్ని ఎన్టీఆర్ గురించి అస్సలు మాట్లాడొద్దు అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా దీనికి డైరెక్టర్ బాబీ సమాధానమిచ్చారు.
డైరెక్టర్ బాబీ ఈ వివాదం గురించి స్పందిస్తూ.. అంత డ్రామా జరగలేదండి అక్కడ. దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవేం లేవు. అక్కడ చూపించిన ఫోటోల గురించి మాత్రమే అడిగారు బాలయ్య. నేను వాటికే సమాధానం చెప్పాను అంతే. షూటింగ్ గ్యాప్ లో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. మా తారక్ అయితే బాగుంటాడు ఇందులో అని బాలయ్య అన్నారు. అది రికార్డెడ్ అవ్వలేదు కాబట్టి బయటకు రాలేదు. ఆయనకు జైలవకుశ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమా గురించి నాతో రెండు మూడు సార్లు మాట్లాడారు. అలంటి విబేధాలు ఏమి లేవు. చిన్నదాన్ని మనమే అనవసరంగా పెద్దదిగా చేస్తుంటాం అని అన్నారు.
దీంతో డైరెక్టర్ బాబీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాబీ, నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య – ఎన్టీఆర్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేయడం ఆపేస్తారా లేదా చూడాలి. ఒకసారి బాబాయ్ – అబ్బాయి కలిసి కనపడితే కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అయ్యేలా లేరు. ఇక బాలయ్య డాకు మహారాజ్ సినిమా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్స్ గా, బాబీ డియోల్ విలన్ గా నటించారు.