NTR – Balayya : బాలయ్య ఎన్టీఆర్ గురించి అలా అన్నారా? బాలయ్య – ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ నేపథ్యంలో నిర్మాత వ్యాఖ్యలు..
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Nagavamsi gives Clarity on Balakrishna NTR Issue Regarding Unstoppable Show
NTR – Balayya : గత కొన్ని రోజులుగా నందమూరి ఫ్యామిలిలో కూడా వివాదం నడుస్తుందని, బాలయ్య – ఎన్టీఆర్ మధ్య విబేధాలు వచ్చాయని పలు వార్తలు వచ్చాయి. ఒకప్పుడు హరికృష్ణ చనిపోయాక ఓ సినిమా ఈవెంట్ కి వచ్చి మరీ బాలయ్య.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఉద్దేశించి నా కొడుకులు వీళ్ళు అంటూ తమ బంధాన్ని చూపెట్టారు. బాబాయ్ – అబ్బాయి బంధంతో ఫ్యాన్స్ తెగ సంతోషించారు.
కానీ గత కొంతకాలంగా బాలయ్య ఎన్టీఆర్ పేరు ఎత్తట్లేదు. ఎన్టీఆర్ బాలయ్య పేరు ఎత్తట్లేదు. తారకరత్న చనిపోయిన సమయంలో ఎన్టీఆర్ ని బాలయ్య పట్టించుకోలేదని పలు వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పట్నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపరేట్ అయి బాలయ్యపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కూడా ఎన్టీఆర్ ని పిలవలేదు అని విమర్శలు చేసారు.
Also Read : Ajay Devgn : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గుర్రాన్ని తీసుకొచ్చిన స్టార్ హీరో.. స్టేజి ఎక్కించి..
ఇక బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఎవరొచ్చినా అందరి హీరోల గురించి అడుగుతున్నారు ఒక్క ఎన్టీఆర్ గురించి తప్ప. ఇటీవల డైరెక్టర్ బాబీ షోకి రాగా అతను పనిచేసిన హీరోలందరి గురించి అడిగారు బాలయ్య ఒక్క ఎన్టీఆర్ గురించి తప్ప. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యని, డైరెక్టర్ బాబీని విమర్శిస్తూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన డాకు మహారాజ్ సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యపై, సినిమాపై విమర్శలు చేయడంతో ఇటీవల నిర్మాత నాగవంశీ అందరం ఒకటే.. కష్టపడి సినిమా చేసాము, సపోర్ట్ చేయండి అంటూ ట్వీట్ పెట్టారు. దానికి కూడా పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము సపోర్ట్ చెయ్యము అంటూ రిప్లైలు ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో యాంకర్ బాలయ్య – ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ గురించి ప్రస్తావించి, అన్ స్టాపబుల్ షోలో జైలవకుశ గురించి అడిగి తర్వాత ఎడిటింగ్ లో తీసేసారా అని ప్రశ్నించాడు. దీనికి నాగవంశీ సమాధానమిస్తూ.. అస్సలు షోలో జైలవకుశ గురించి గాని, ఎన్టీఆర్ అన్న గురించి గాని ప్రస్తావన రాలేదు. లైవ్ లో కాకుండా మేము మాట్లాడుకునేటప్పుడు ఓ సినిమా క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ అది జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని బాలకృష్ణ గారు అన్నారు మాతోటి. మాకు బాలకృష్ణ ఇష్టం, ఎన్టీఆర్ అంటే కూడా ఇష్టం. రేపు మోక్షు వచ్చినా ప్రేమిస్తాం. ఇలాంటి సమయంలో ఇలాంటి వార్తలు చూస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది అని అన్నారు.
దీంతో నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై కూడా పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాద్ధాంతం చేస్తున్నారు. బాలకృష్ణ నిజంగానే ఎన్టీఆర్ గురించి మాట్లాడారా? అందరి హీరోల గురించి ప్రస్తావించి ఎన్టీఆర్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే ఇది మెగా ఫ్యామిలీ – అల్లుఅర్జున్ ఇష్యూలా మారుతుందని అంటున్నారు.
ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది అని బాలయ్య అన్నారు. pic.twitter.com/XICpdWIpAu
— Telugu360 (@Telugu360) January 6, 2025
ఫ్యాన్స్ సినిమాలు చూసి ఎంజాయ్ చేయకుండా ఇటీవల అయినదానికీ కానిదానికీ ఫ్యాన్ వార్స్ చేస్తూ ప్రతి చిన్నవిషయాన్ని, అక్కర్లేని విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని సినిమా లవర్స్ అంటున్నారు. మేము మేము బాగానే ఉంటాము అని ఇప్పటికే చాలా మంది హీరోలు చెప్పినా, అసలు సినిమాల గురించి కాకుండా వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకు అని అనుకున్నా కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఇలాగే నెగిటివిటి స్ప్రెడ్ చేస్తున్నారు. నాగవంశీ కామెంట్స్ తర్వాత అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైలెంట్ అవుతారా చూడాలి.