Game Changer Target : తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలి?
గేమ్ ఛేంజర్ కి ఉన్న హైప్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని సమాచారం.

Ram Charan Game Changer Telugu States Theatrical Business Details Here
Game Changer Target : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ కూడా భారీగానే చేసారు. ఇప్పటికే అమెరికాలో, ముంబైలో, ఏపీలో ఈవెంట్స్ నిర్వహించారు. ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ గా వచ్చి సినిమాపై భారీ హైప్ తెచ్చారు. ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసారు.
గేమ్ ఛేంజర్ కి ఉన్న హైప్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని సమాచారం. టాలీవుడ్ టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ సినిమాకు భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 36 కోట్లకు, ఏపీలో 72 కోట్లకు, సీడెడ్ లో 22 కోట్లకు గేమ్ ఛేంజర్ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. అంటే మొత్తం ఆల్మోస్ట్ 130 కోట్ల థియేటరికల్ బిజినెస్ జరిగింది.
Also Read : Ram Charan : మహేష్, ప్రభాస్ ఇద్దరిలో చరణ్ ఎవరితో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాడో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 260 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇక హిట్ అవ్వాలంటే 300 కోట్ల గ్రాస్ కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి. దీంతో గేమ్ ఛేంజర్ టార్గెట్ గట్టిగానే ఉంది. గేమ్ ఛేంజర్ ఓవరాల్ గా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బరిలోకి దిగుతుందని సమాచారం. తమిళ్ లో కూడా గేమ్ ఛేంజర్ థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ 32 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
నార్త్, కన్నడ, కేరళతో పాటు ఓవర్సీస్ లలో కూడా గేమ్ ఛేంజర్ కి మంచి బిజినెస్ జరిగిందని సమాచారం. వాటి లెక్కలు బయటకు రావాల్సి ఉంది. సంక్రాంతి హాలిడేస్, ఏపీలో టికెట్ రేట్ల పెంపు, తమిళనాడులో పెద్ద సినిమాలు లేకపోవడం గేమ్ ఛేంజర్ కి బాగా కలిసి రానుంది. మరి గేమ్ ఛేంజర్ సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
దిల్ రాజు నిర్మాణంలో శ్రీ ఎంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్, SJ సూర్య, నవీన్ చంద్ర.. పలువురు స్టార్స్ నటిస్తున్నారు. ఇందులో చరణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అవ్వనుంది. ఇప్పటివరకు రిలీజయిన అన్ని సాంగ్స్ హిట్ అవ్వడం, ట్రైలర్ చూసాక సినిమాపై మరింత ఆసక్తి పెరగడంతో ఫ్యాన్స్, సినిమా లవర్స్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.