Game Changer Song : గేమ్ ఛేంజర్ నుంచి చరణ్, అంజలి ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది.. ‘అలికి పూసిన అరుగు మీద.. ‘

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మెలోడీ సాంగ్ వచ్చేసింది. మీరు కూడా వినేయండి..

Game Changer Song : గేమ్ ఛేంజర్ నుంచి చరణ్, అంజలి ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది.. ‘అలికి పూసిన అరుగు మీద.. ‘

Ram Charan Anjali Game Changer Movie Melody Song Released

Updated On : January 7, 2025 / 1:57 PM IST

Game Changer Song : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజగా ఈ సినిమా నుంచి మరో మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.

Also Read : Sreeja – Sania Mirza : చిరంజీవి కూతురు శ్రీజ బిజినెస్ లో సానియా మీర్జా పెట్టుబడులు.. పిల్లల కోసం..

చరణ్, అంజలి జంటగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ సాంగ్ రానుంది. ఇటీవల జరిగిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ పాటను వినిపించారు. ఈ మెలోడీ సాంగ్ అందరికి నచ్చేయడంతో అధికారికంగా పాటను రిలీజ్ చేయమని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసారు. దీంతో మూవీ యూనిట్ తాజాగా ‘అలికి పూసిన అరుగు మీద.. ‘ అనే ఈ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ పాటను వినేయండి..

ఇక ఈ సాంగ్ కాసర్ల శ్యామ్ రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో తమన్, రోషిని పాడారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ గా మారింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ అప్పన్న పాత్రలో, అంజలి పార్వతి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అందరికి తెగ నచ్చేస్తుంది అని, ఆ పాత్రలో చరణ్ యాక్టింగ్ అదుర్స్ అని మూవీ టీమ్ అంటున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా పైనుంచి జరగండి జరగండి సాంగ్, ధోప్ సాంగ్, నానా హైరానా సాంగ్, రా మచ్చ సాంగ్స్ ని రిలీజ్ చేసారు. ఈ పాటలన్ని మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ మెలోడీ సాంగ్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

Also Read : Akira Nandan – Ram Charan : అకిరా నంద‌న్ సినీ ఎంట్రీ పై రామ్‌చ‌ర‌ణ్ కామెంట్స్‌.. అన్‌స్టాప‌బుల్ షోలో..

గేమ్ ఛేంజర్ సినిమాలో సాంగ్స్ కే ఆల్మోస్ట్ 75 కోట్లు ఖర్చుపెట్టానని నిర్మాత దిల్ రాజు ఇటీవల తెలిపారు. శంకర్ సినిమాల్లో సాంగ్స్ గ్రాండియర్ గా ఉంటాయని తెలిసిందే. అందుకే ఈ రేంజ్ లో ఖర్చుపెట్టి తీశారు. ఇప్పటికే 5 సాంగ్స్ రిలీజ్ చేయగా మరో పాట కూడా ఉందని తెలుస్తుంది. ఇక ఈ పాటలకు ఒక్కో పాటకు ఒక్కో డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడం విశేషం.