Sreeja – Sania Mirza : చిరంజీవి కూతురు శ్రీజ బిజినెస్ లో సానియా మీర్జా పెట్టుబడులు.. పిల్లల కోసం..

దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించగా శ్రీజా మాట్లాడుతూ..

Sreeja – Sania Mirza : చిరంజీవి కూతురు శ్రీజ బిజినెస్ లో సానియా మీర్జా పెట్టుబడులు.. పిల్లల కోసం..

Sania Mirza joins the Seesaw Spaces family alongside Swati Gunupati and Sreeja Konidela

Updated On : January 7, 2025 / 1:43 PM IST

Sreeja – Sania Mirza : చిరంజీవి రెండో కూతురు శ్రీజ కొణిదెల అందరికి పరిచయమే. గతంలో పలు మార్లు వార్తల్లో నిలిచింది. అయితే శ్రీజ సంవత్సరం క్రితం తన స్నేహితురాలు స్వాతి గునుపాటితో కలిసి ఓ బిజినెస్ మొదలుపెట్టింది. పిల్లా కోసం ‘సీ సా’ అనే సంస్థని స్థాపించింది. ఇది ఒక ప్లే స్కూల్ లాంటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో సీ సా సేవలు అందిస్తుంది.

Also Read : Akira Nandan – Ram Charan : అకిరా నంద‌న్ సినీ ఎంట్రీ పై రామ్‌చ‌ర‌ణ్ కామెంట్స్‌.. అన్‌స్టాప‌బుల్ షోలో..

ఈ సీ సా ప్లేస్ కి చిన్న పిల్లలే కాకుండా స్కూల్ కి వెళ్లే పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఆడుకోవచ్చు, ప్రశాంత సమయం గడపచ్చు, కొత్త కొత్త సంగతులు నేర్చుకోవచ్చు, బర్త్ డే పార్టీలు చేసుకోవచ్చు. సంవత్సరం క్రితమే ఈ బిజినెస్ మొదలుపెట్టినా ఇప్పుడు టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాతో కలిసి బిజినెస్ ని మరింత పెంచబోతున్నారు. శ్రీజ, స్వాతి బిజినెస్ లో సానియా మీర్జా తాజాగా పెట్టుబడులు పెట్టింది.

View this post on Instagram

A post shared by SEESAW (@seesaw_spaces)

దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించగా శ్రీజా మాట్లాడుతూ.. మా ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. పిల్లలకు మంచి స్పేస్ క్రియేట్ చేయాలి. వాళ్ళ ఫిట్నెస్, మెంటల్ హెల్త్ కోసం ఒక ప్లేస్ ఉండాలి అని మేమిద్దరం కలిసి ఈ సీ సా స్టార్ట్ చేసాము సంవత్సరం క్రితం. సానియా కూడా పిల్లల కోసం ఇలాంటి ఒక ఐడియాతో మా దగ్గరకు వచ్చింది. స్పోర్ట్ లో పిల్లల్ని డెవలప్ చేయడం సానియా ఆలోచన. అందుకే మేము సానియాతో కలిసాము. పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలను పేరెంట్స్ ఇక్కడికి తీచుకొచ్చి వాళ్ళతో సమయం గడిపి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వొచ్చు. ఇక్కడికి వచ్చిన పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. వన్ ఇయర్ నుంచి మంచి స్పందన వస్తుంది. త్వరలోనే ఈ బిజినెస్ హైదరాబాద్ తర్వాత దేశం నలుమూలల స్థాపించాలి అనుకుంటున్నాం అని తెలిపింది.

Also Read : The Lady Killer : రూ.45 కోట్లు పెట్టి తీస్తే.. అక్ష‌రాలా ల‌క్ష కూడా రాబ‌ట్ట‌లేక‌పోయిన స్టార్ హీరో సినిమా..

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సీ సా సంస్థని నిర్వహిస్తున్నారు. త్వరలోనే దీన్ని మరింత డెవలప్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి చిరంజీవి కూతురు శ్రీజను అభినందిస్తున్నారు. ఇక సానియా కూడా ఈ సంస్థలో భాగమవడంతో దీనికి మరింత రీచ్ వచ్చే అవకాశం ఉంది.