The Lady Killer : రూ.45 కోట్లు పెట్టి తీస్తే.. అక్ష‌రాలా ల‌క్ష కూడా రాబ‌ట్ట‌లేక‌పోయిన స్టార్ హీరో సినిమా..

ఓ స్టార్ హీరో న‌టించిన ఓ మూవీ కోట్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే క‌నీసం ల‌క్ష రూపాయ‌లు కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది.

The Lady Killer : రూ.45 కోట్లు పెట్టి తీస్తే.. అక్ష‌రాలా ల‌క్ష కూడా రాబ‌ట్ట‌లేక‌పోయిన స్టార్ హీరో సినిమా..

Arjun Kapoor Lady Killer is biggest disaster movie in indian cinema History

Updated On : January 7, 2025 / 12:06 PM IST

సాధార‌ణంగా ఓ సినిమా జ‌యాప‌జాలు అనేవి ఎవ‌రి చేతుల్లో ఉండ‌వు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌కుంటే ఎంతటి స్టార్ హీరో న‌టించిన సినిమా అయినా కూడా ప‌రాజ‌యాన్ని చ‌విచూడాల్సిందే. అయితే.. స్టార్ హీరోల సినిమాలు ప్లాప్స్ అయినా కూడా ఓ మోస్త‌రుగా క‌లెక్ష‌న్లు వ‌స్తుంటాయి. డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకున్న మూవీలు సైతం కోట్లు రాబ‌డుతాయి. అయితే.. ఓ స్టార్ హీరో న‌టించిన ఓ మూవీ కోట్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే క‌నీసం ల‌క్ష రూపాయ‌లు కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది.

ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రు? ఆ సినిమా సంగ‌తి ఏంటి అని అంటారా..? ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. బ‌డా నిర్మాత బోనీక‌పూర్ వార‌సుడు అర్జున్ క‌పూర్‌. ఆ సినిమా మ‌రేదో కాదు ‘ద లేడీ కిల్లర్’. అజయ్ బేహల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. భూమి ఫడ్నేకర్ క‌థానాయిక‌. 2023లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. ఈ క్రైమ్ థిల్ల‌ర్ ఈ చిత్రం తెర‌కెక్కేంచేందుకు రూ.45 కోట్ల‌కు పైగా ఖ‌ర్చైంది. ప్ర‌మోష‌న్ల‌కు మ‌రో రెండు కోట్ల‌కు పైగానే ఖ‌ర్చైంది.

Unstoppable With NBK : చ‌ర‌ణ్‌ను ఇరుకున పెట్టిన‌ బాల‌య్య‌.. స‌మంత, కియారా, అలియాల‌లో ఉత్త‌మ న‌టి ఎవ‌రు..?

ఇక ఈ సినిమా తొలి రోజు కేవ‌లం 293 టికెట్లు మాత్ర‌మే అమ్ముడు పోయాయ‌ట‌. దీంతో 38 వేల‌ రూపాయ‌లు మాత్ర‌మే వ‌చ్చాయి. మొత్తంగా ఈ సినిమా పుల్ ర‌న్‌లో 70 వేల రూపాయ‌లు క‌లెక్ష‌న్లు సాధించింది. దీంతో భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో అత్యంత దారుణ‌మైన బాక్సాఫీస్ వైఫ‌ల్యంగా నిలిచింది. ఇలాంటి చెత్త మూవీ మ‌రొక‌టి లేద‌ని నెటిజ‌న్లు అంటుంటారు.

అస‌లు కార‌ణం ఇదే..

మ‌రీ ల‌క్ష రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోవ‌డానికి ఓ మేజ‌ర్ కార‌ణం ఉంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాకుండానే విడుద‌ల చేశార‌ట‌. దీంతో వాయిస్ ఓవ‌ర్‌ల‌పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డాల్సి వచ్చింద‌ట‌. ఈ క్ర‌మంలో తొలి ఆట‌కే డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఈ క‌ళాఖండం 2023 న‌వంబ‌ర్ 3న‌ విడుద‌లైంది. ఇక దేశ వ్యాప్తంగా కేవ‌లం 12 షోలు మాత్ర‌మే ప‌డ్డాయి. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. చిత్రానికి డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చినా కూడా అర్జున్ క‌పూర్‌, భూమి ప‌డ్నేక‌ర్‌, ప్రియాంక బోస్‌ల న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

Allu Arjun : శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించిన అల్లు అర్జున్‌..

థియేట‌ర్ల‌లో ఎప్పుడు వ‌చ్చి, వెళ్లి పోయిందో తెలియ‌ని ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.