Allu Arjun : శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించిన అల్లు అర్జున్‌..

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన బాలుడు శ్రీతేజ్‌ను సినీ న‌టుడు అల్లు అర్జున్ ప‌రామ‌ర్శించారు.

Allu Arjun : శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించిన అల్లు అర్జున్‌..

Allu Arjun reached kims hospital and inquiring with the doctors about sriteja health

Updated On : January 7, 2025 / 10:38 AM IST

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన బాలుడు శ్రీతేజ్‌ను సినీ న‌టుడు అల్లు అర్జున్ ప‌రామ‌ర్శించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న బేగంపేట కిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. బాలుడిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం అత‌డి ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యులను పూర్తి వివ‌రాలు అడిగితెలుసుకున్నారు. శ్రీతేజ్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్‌తో పాటు తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్ రాజు సైతం ఆస్ప‌త్రికి వ‌చ్చి శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించారు.

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ చ‌నిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్రస్తుతం శ్రీతేజ్‌ బేగంపేటలోని కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడిని ప‌రామ‌ర్శించేందుకు బ‌న్నీ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. తాను ఆస్ప‌త్రికి వ‌స్తున్నాను అన్న సంగ‌తిని ముందుగానే అల్లు అర్జున్ రాంగోపాల్ పేట పోలీసుల‌కు తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో ఆస్ప‌త్రి వ‌ద్ద పోలీసులు పెద్ద సంఖ్య‌లో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమాపై కూడా డాక్యుమెంటరీ.. అందుకే పూజ కార్యక్రమం సీక్రెట్ గా..?

కాగా.. డిసెంబ‌ర్ 4న సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై రాంగోపాల్ పేట పోలీసులు కేసు న‌మోదు చేశారు. అల్లుఅర్జున్ ను అరెస్ట్ చేసి నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. న్యాయ‌స్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అదే రోజు అల్లు అర్జున్ న్యాయ‌వాదులు హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేయ‌గా బ‌న్నీ జైలు నుంచి విడుద‌ల అయ్యారు.

రిమాండ్ గ‌డువు ముగిసిన త‌రువాత నాంప‌ల్లి కోర్టులో రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ ను అల్లు అర్జున్ దాఖ‌లు చేశారు. నాంపల్లి కోర్టు ఆయ‌న‌కు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే.

Kevvu Karthik : పుష్ప గంగమ్మ జాతర గెటప్ లో జబర్దస్త్ నటుడు.. త్వరలో స్కిట్?

ఇదిలా ఉంటే.. పుష్ప‌2 చిత్ర బృందం రేవ‌తి కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. హీరో అల్లు అర్జున్ రూ.కోటీ రూపాయ‌లు, నిర్మాత‌లు రూ.50ల‌క్ష‌లు, ద‌ర్శ‌కుడు సుకుమార్ రూ.50ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం చేశారు.