SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమాపై కూడా డాక్యుమెంటరీ.. అందుకే పూజ కార్యక్రమం సీక్రెట్ గా..?

SSMB29 ఓపెనింగ్‌ ప్రోగ్రామ్‌ను కూడా డాక్యుమెంటరీలా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి.

SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమాపై కూడా డాక్యుమెంటరీ.. అందుకే పూజ కార్యక్రమం సీక్రెట్ గా..?

Rajamouli Plans Mahesh Babu SSMB 29 Movie Opening Ceremony as Documentary Rumours goes Viral

Updated On : January 6, 2025 / 7:26 PM IST

SSMB 29 : సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు దర్శకధీరుడు రాజమౌళి ఫ్యాన్స్‌ ఇంట్రెస్టింగ్‌గా వెయిట్‌ చేస్తున్న SSMB29 మూవీ ట్రాక్ ఎక్కబోతుంది. హైదరాబాద్‌లో ఆల్రెడీ ఇటీవల పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాకి శ్రీకారం చుట్టారు. కాస్త షూటింగ్ చేసి త్వరలోనే అధికారికంగా షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే హీరోగా మహేశ్‌బాబు తన సినిమాల ప్రారంభోత్సవానికి ఎప్పుడూ హాజరు కారు. కానీ ఈసారి ఆయన సమక్షంలోనే పూజా కార్యక్రమాలు జరిగాయి.

అయినా కూడా సినిమా ఓపెనింగ్‌ ప్రోగ్రామ్‌ను చాలా సింపుల్‌గా మీడియా కవరేజ్‌ లేకుండా కంప్లీట్‌ చేశారు రాజమౌళి. అసలు మీడియా కవరేజ్ కాదు కదా లీక్స్ కూడా ఏమి లేవు. మహేశ్‌ పూజా కార్యక్రమానికి హాజరైనా మీడియా కవరేజ్‌కు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దాని వెనుక జక్కన్న పెద్ద ప్లానే వేశారన్న టాక్ వినిపిస్తోంది.

Also See : సోనూసూద్ డైరెక్టర్, హీరోగా ‘ఫతే’ సినిమా.. ట్రైలర్ చూశారా.. ఫుల్ వైలెంట్ గా..

సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు రాజమౌళి. కనీసం ఎవరెవరు వచ్చారు? ఎప్పుడు సినిమా ఓపెనింగ్‌కు రానీ మహేశ్ కూడా వచ్చాడని ప్రచారం జరిగింది. అసలు వచ్చాడా లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు. అయితే మూవీ ఓపెనింగ్ విజువల్స్ బయటికి రివీల్ చేయకపోవడంపై టాలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

SSMB29 ఓపెనింగ్‌ ప్రోగ్రామ్‌ను కూడా డాక్యుమెంటరీలా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ఇటీవల RRR సినిమా మేకింగ్ పై డాక్యుమెంటరీ వచ్చిన సంగతి తెలిసిందే. అలా మహేష్ సినిమా మేకింగ్, ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ పై డాక్యుమెంటరీ లేదా స్పెషల్ గా ఓటీటీకి సేల్ చేస్తున్నారట. సినిమాపై ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట రాజమౌళి. ఈ విషయం తెలిసి రాజమౌళి కమర్షియల్ ఆలోచనలకు షాక్ అవుతున్నారు.

Also Read : Nayanthara : మొన్న ధనుష్.. ఇప్పుడు చంద్రముఖి నిర్మాతలు.. ఆ విషయంలో నయనతారకు మళ్ళీ షాక్..

అసలు సినిమా ఓపెనింగ్ నుంచి ఒక్క ఫోటో అయినా రిలీజ్ చేయమని మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజమౌళి మాత్రం సినిమా అకంటెంట్ కాదు కదా సినిమా ఈవెంట్స్ కూడా లీక్ అవ్వొద్దని పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆస్కార్‌ వేదికపై మెరిసిన తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మొదటి మూవీ ఇదే. మహేశ్‌కు ఇది 29వ మూవీ. దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు.

ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా, అటవీ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ రాబోతుంది. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్‌ నుంచే కమర్షియల్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఇక రిలీజ్‌ నాటికి ఎంత బిజినెస్‌ చేస్తాడోనన్న చర్చ జరుగుతోంది.