Nayanthara : మొన్న ధనుష్.. ఇప్పుడు చంద్రముఖి నిర్మాతలు.. ఆ విషయంలో నయనతారకు మళ్ళీ షాక్..
డాక్యుమెంటరీ విషయంలో ఇప్పుడు నయనతారకు మరో నిర్మాతలు నోటీసులు పంపించారు.

After Dhanush Chandramukhi Producers sends Legal Notice to Nayanathara Regarding her Documentary
Nayanthara : ఇటీవల నయనతార డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ తో వివాదం జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ధనుష్ – నయనతార వివాదం సాగింది. నయనతార లైఫ్ పై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తెరకెక్కించగా అందులో ధనుష్ నిర్మాణంలో నయనతార నటించిన నేను రౌడీనే సినిమా కంటెంట్ ని ధనుష్ పర్మిషన్ లేకుండా వాడుకున్నందుకు ధనుష్ నయన్ కు పది కోట్లు కట్టాలని లీగల్ నోటీసులు పంపించాడు.
Also Read : Vishal Health : విశాల్ కి ఏమైంది.. బక్కగా అయిపోయి.. వణుకుతూ.. క్లారిటీ ఇచ్చిన డాక్టర్లు..
అయితే ఇదే డాక్యుమెంటరీ విషయంలో ఇప్పుడు నయనతారకు మరో నిర్మాతలు నోటీసులు పంపించారు. ఈ డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాకు సంబంధించిన కంటెంట్ తమ పర్మిషన్ లేకుండానే వాడుకుందని నిర్మాతలు ప్రభు, గణేశన్ నయనతారకు 5 కోట్లు కట్టాలంటూ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వార్త సంచలనంగా మారింది.
ఇప్పటివరకు అయితే నయనతార ఇంకా దీనిపై స్పందించలేదు. గతంలో ధనుష్ లీగల్ నోటిస్ పంపిస్తే నయనతార సీరియస్ అయి పర్మిషన్ కోసం నీ వెనక తిరిగితే నువ్వు సమాధానం ఇవ్వలేదు. మాకు ఆ సినిమా స్పెషల్ కాబట్టి వాడుకున్నాము అంటూనే నువ్వు అందర్నీ ఇబ్బంది పెడతావు, ఆ సినిమా సమయంలో మమల్ని కూడా యిబ్బంది పెట్టావు, అందరూ నిన్ను మంచివాళ్ళు అనుకుంటారు కానీ నీ అసలు రూపం ఎవ్వరికి తెలీదు. మూడు సెకండ్స్ కే ఇలా నోటీసులు పంపిస్తావా అంటూ ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ పబ్లిక్ గానే పోస్ట్ పెట్టింది.
దీంతో ఆ వివాదం మరింత జటిలంగా మరింది. ఏకంగా ముప్పై సెకండ్స్ ధనుష్ సినిమా కంటెంట్ నయన్ డాక్యుమెంటరీలో వాడటంతో అబద్దం కూడా చెప్పిందని ధనుష్ ఫ్యాన్స్ నయనతారను సోషల్ మీడియాలో టార్గెట్ చేసి విమర్శలు చేసారు. నయన్ ఫ్యాన్స్ కూడా ధనుష్ పై విమర్శలు కురిపించారు. ప్రస్తుతం ధనుష్ – నయనతార కేసు కోర్టులో ఇంకా నడుస్తుంది.
ఈ లోపే చంద్రముఖి నిర్మాతలు కూడా ఇలా నయనతారకు ఇదే విషయంలో నటిసులు పంపించడం తమిళనాట చర్చగా మారింది. మరి ఇప్పుడు దీనికి నయన్ ఏం సమాధానమిస్తుందో చూడాలి. ఈ క్రమంలో మరోసారి ధనుష్ ఫ్యాన్స్ నయన్ ని విమర్శిస్తున్నారు. ఇక నెట్ ఫ్లిక్స్ లో రిలీజయిన నయనతార డాక్యుమెంటరీలో.. తాను నటిగా ఎలా మారింది, తన కాలేజీ లైఫ్, తన కెరీర్ ఆరంభం, తన ఫ్యామిలీ, తన సినిమా కష్టాలు, తనపై వచ్చిన ట్రోల్స్, తన ప్రేమ, పెళ్లి గురించి.. అన్ని విషయాలు తెలిపారు. ఇందుకు గాను తాను నటించిన పలు సినిమాలలోని కంటెంట్ ని వాడుకుంది. ఈ క్రమంలోనే నేను రౌడీనే, చంద్రముఖి సినిమాల్లోని కంటెంట్ నిర్మాతల పర్మిషన్స్ లేకుండా వాడుకున్నందుకు ధనుష్, ప్రభు నోటీసులు పంపించారు.