Akira Nandan – Ram Charan : అకిరా నందన్ సినీ ఎంట్రీ పై రామ్‌చరణ్ కామెంట్స్.. అన్‌స్టాపబుల్ షోలో..
అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Ram charan talks about Akira Nandan in Unstoppable With NBK show
అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడైన అకిరా ఎప్పుడెప్పుడు సినిమాల్లో వస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అకిరా సినిమాల్లోకి వస్తాడో రాడో కూడా తెలియదు. దీనిపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడారు.
బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్ 4 ఆహాలో అద్భుతంగా దూసుకుపోతుంది. తొమ్మిదో ఎపిసోడ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చారు. ఎన్నో విషయాలను ఆయన పంచుకున్నారు. ఈ క్రమంలో అకిరా గురించి కూడా చరణ్ మాట్లాడారు. గేమ్ ఛేంజర్ మూవీలో అకిరా ఉంటాడని సరదాగా అందరిని ఆటపట్టించారు.
కాగా.. ఈ షోలో అకిరా గురించి రామ్‌చరణ్ ఏం చెప్పారు. అకిరా సినీ రంగప్రవేశం గురించి మాట్లాడారా ? ఇంకా ఏం అన్నారు విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ షో ఆహా వేదికగా జనవరి 8 (బుధవారం ) రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. చరణ్ తో పాటు శర్వానంద్, నిర్మాత దిల్ రాజులు ఈ షోలో పాల్గొన్నారు.
శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ కథానాయిక. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ఈ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.