Ajay Devgn : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గుర్రాన్ని తీసుకొచ్చిన స్టార్ హీరో.. స్టేజి ఎక్కించి..

తాజాగా ఓ బాలీవుడ్ సినిమా ఈవెంట్ కు గుర్రాన్ని తీసుకొచ్చారు.

Ajay Devgn : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గుర్రాన్ని తీసుకొచ్చిన స్టార్ హీరో.. స్టేజి ఎక్కించి..

A horse came to Ajay Devgn Azaad Movie Trailer Launch Event

Updated On : January 7, 2025 / 4:03 PM IST

Ajay Devgn : సాధారణంగా సినిమా ఈవెంట్స్ కి హీరోలు, డైరెక్టర్స్ తో పాటు మూవీకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వస్తారని తెలిసిందే. అప్పుడప్పుడు సినిమాల్లో ఏవైనా జంతువులు ముఖ్య పాత్రలు పోషిస్తే వాటిని కూడా సినిమా ఈవెంట్స్ కి తీసుకొస్తారు. గతంలో పలు సినిమా ఈవెంట్స్ కు కూడా జంతువులు వచ్చాయి. తాజాగా మరోసారి ఓ బాలీవుడ్ సినిమా ఈవెంట్ కు గుర్రాన్ని తీసుకొచ్చారు.

A horse came to Ajay Devgn Azaad Movie Trailer Launch Event

Also Read : Game Changer Target : తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలి?

అజయ్ దేవగణ్, అమన్ దేవగణ్, రాషా తడాని, డయానా పెంటి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ఆజాద్. RSVP మూవీస్ బ్యానర్ పై అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. స్వతంత్రం ముందు కథతో, ఓ ప్రేమకథ, ఓ గుర్రాన్ని నడపడానికి హీరో పడే కష్టంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో గుర్రం చాలా ముఖ్య పాత్ర పోషించింది. దీంతో నిన్న ఆజాద్ సినిమా ట్రైలర్ లాంచ్ జరగ్గా ఈవెంట్ కి సినిమాలోని గుర్రాన్ని తీసుకొచ్చారు.

A horse came to Ajay Devgn Azaad Movie Trailer Launch Event

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఈ సినిమాలో నటించిన గుర్రాన్ని తీసుకొచ్చి స్టేజి ఎక్కించారు. అజయ్ దేవగణ్ తో పాటు మూవీ యూనిట్ కూడా ఆ గుర్రంతో ఫొటోలు దిగారు. స్టేజిపై ఇలా గుర్రాన్ని తీసుకొచ్చి సినిమా ప్రమోషన్స్ చేయడంతో ఈ ఈవెంట్ బాగా వైరల్ అయింది. ఆ గుర్రానికి సంబంధించి ఈవెంట్ వీడియోలు, మూవీ యూనిట్ గుర్రంతో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

A horse came to Ajay Devgn Azaad Movie Trailer Launch Event

ఇక ఈ ఆజాద్ సినిమాతో అజయ్ దేవగణ్ అల్లుడు అమన్ దేవగణ్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాష తడాని బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ ఆజాద్ సినిమా జనవరి 17న హిందీలో రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి..

Also Read : Ram Charan : మ‌హేష్‌, ప్ర‌భాస్ ఇద్ద‌రిలో చ‌ర‌ణ్ ఎవ‌రితో మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నుకుంటున్నాడో తెలుసా?

 

View this post on Instagram

 

A post shared by PRINCE (@ajaydevgnfanclub)