Ajith : రేసింగ్ చేస్తుండగా స్టార్ హీరో కార్ కు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..
తాజాగా అజిత్ కార్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని కార్ కి యాక్సిడెంట్ అయింది.

Tamil Star Hero Ajith Racing Car Crashes During Practice in Dubai Video goes Viral
Ajith Car Racing : తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మంచి రేసర్ అని తెలిసిందే. అజిత్ బైక్ రేసింగ్, కార్ రేసింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా విదేశాల్లో రేసింగ్ ఈవెంట్లో కూడా పాల్గొంటారు అజిత్. సైలెంట్ గా సంవత్సరానికి ఒక సినిమా చేసి తన రేసింగ్ కోసం వెళ్లిపోతుంటారు అజిత్. తన సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎక్కువగా పాల్గొనరు. ఫ్యాన్స్ కూడా హీరోగా అతని సినిమాలను ఇష్టపడుతూనే అతని రేసింగ్ ని కూడా ఇష్టపడతారు.
అయితే తాజాగా అజిత్ కార్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని కార్ కి యాక్సిడెంట్ అయింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం అజిత్ దుబాయ్ లో ఉన్నారు. దుబాయ్ లో 24H Dubai 2025 కార్ రేసింగ్ లో అజిత్ పాల్గొనబోతున్నారు. ఈ రేసింగ్ జనవరి 11, 12 లో జరగనుంది. దీని కోసం అజిత్ రేసింగ్ ట్రాక్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నేడు అజిత్ ప్రాక్టీస్ చేస్తుండగా కార్ వేగంగా వచ్చి అక్కడున్న రేసింగ్ ట్రాక్ గోడను ఢీ కొట్టింది. దీంతో కార్ అక్కడే తిరిగి తిరిగి ఆగింది. కార్ ఆగిన తర్వాత అజిత్ ఆ కార్ నుంచి బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అజిత్ రేసింగ్ కార్ ప్రమాదం విజువల్స్ వీడియో చూడండి..
Ajith Kumar’s massive crash in practise, but he walks away unscathed.
Another day in the office … that’s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0— Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025
వీడియో చూస్తుంటే ఈ ప్రమాదంలో కార్ బాగా దెబ్బ తిన్నట్టు కనిపిస్తుంది. అజిత్ మాత్రం క్షేమంగా బయటకు వచ్చినట్టు కనిపించినా అతనికి ఏమైనా గాయాలు అయ్యాయా, అతను బాగానే ఉన్నారా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అజిత్ కానీ, అతని ఫ్యామిలీ కానీ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం అజిత్ రేసింగ్ కార్ వార్త చర్చగా మారింది. అలాగే ఈ యాక్సిడెంట్ తర్వాత అజిత్ ఈ కార్ రేసింగ్ ఈవెంట్లో లో పాల్గొంటాడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అజిత్ నటించిన విదాముయార్చి సినిమా సంక్రాతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా చివరి నిముషంలో వాయిదా పడింది. మరో సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్టు ఇటీవలే ప్రకటించారు.