Site icon 10TV Telugu

Kiccha Sudeep : తల్లి మరణాన్ని తట్టుకోలేక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన కిచ్చా సుదీప్..

Kiccha Sudeep Emotional Post on his Mother

Kiccha Sudeep Emotional Post on his Mother

Kiccha Sudeep : కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తల్లి ఇటీవల కన్నుమూశారు. అనారోగ్య సమస్యల వల్ల ఆమె చనిపోయారు. దీంతో కిచ్చా సుదీప్ ఇంట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. అయితే తాజాగా సుదీప్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసారు.

Also Read : Naveen Chandra : ‘గేమ్ ఛేంజర్’ పై ఇప్పుడున్నది అసలు హైపే కాదు.. నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు..

కిచ్చ సుదీప్ తన పోస్ట్ లో.. నా మొదటి గురువు, నా మొదటి ఫ్యాన్, ఎప్పుడూ నా బాగుకోరే మా అమ్మ ఇప్పుడు ఓ జ్ఞాపకం మాత్రమే. నా బాధ మాటల్లో చెప్పలేను. కేవలం 24 గంటల్లో మొత్తం మారిపోయంది. ప్రతి రోజు ఉదయం ఆమె మెసేజ్ తోనే మొదలయ్యేది. కానీ శుక్రవారం రోజు అదే తన చివరి మెసేజ్ అయ్యింది. తరువాత రోజు నుండి తన మెసేజ్ లు కనిపించడం లేదు. బిగ్ బాస్ షూటింగ్లో ఉన్నప్పుడు మీ మదర్ కి సీరియస్ గా ఉందని కాల్ వచ్చింది. వెంటనే మా సిస్టర్ కి కాల్ చేసి కనుకున్నా. కానీ కొన్ని గంటల్లోనే అంతా జరిగిపోయింది. మా అమ్మ మాతో లేదు అన్న విషయాన్ని ఇంకా తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మ నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు ఆమె శాంతితో నిండిన ప్రదేశానికి చేరుకుంది అనుకుంటున్నాను. బాగా రెస్ట్ తీసుకో అమ్మ ఐ లవ్ యూ నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Exit mobile version