‘‘విక్రాంత్ రోనా’’.. పేరు మాత్రమే కాదు.. క్యారెక్టర్ కూడా సాలిడ్‌గా ఉంటుంది..

కరోనా విపత్కర పరిస్థితుల్లో సినిమా షూటింగ్ చేయడానికి ఎవరు భయపడ్డా తానేం తగ్గేది లేదు అంటూ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తను హీరోగా నటిస్తున్న ‘ఫాంటమ్’ మూవీ షూటింగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించిన సంగతి సంగతి తెలిసిందే. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ తక్కువమంది సిబ్బందితో రెగ్యులర్ షూటింగ్ జరిపారు. తాజాగా ‘ఫాంటమ్’ సినిమా నుంచి సుదీప్ లుక్ రిలీజ్ చేశారు.
ఇందులో సుదీప్ క్యారెక్టర్ పేరు విక్రాంత్ రోనా అని పరిచయం చేస్తూ ‘‘ఈ పేరు ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో, క్యారెక్టర్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. తను ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడు? అని ఎవరికీ తెలియదు. కానీ ఆ పనుల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది’’ అంటూ డైరెక్టర్ అనూప్ భండారి సుదీప్ పాత్ర గురించి సూక్ష్మంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కోవిడ్-19 తర్వాత ప్రభుత్వ విధి విధానాల మేరకు షూటింగ్ స్టార్ట్ చేసిన కాస్త తెలిసిన హీరో సినిమా, దాని తాలూకు అప్‌డేట్ ఇదే కావడం విశేషం.