Kichcha Sudeep Mark movie OTT streaming update.
Mark OTT: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయనకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆయన చేసే ప్రతీ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మార్క్(Mark OTT)’. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను విజయ్ కార్తికేయ తెరకెక్కించాడు.
Dimple Hayathi: భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్ ఈవెంట్ లో డింపుల్ హయతి.. ఫొటోలు
టీజర్, ట్రైలర్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, తాజాగా మార్క్ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ సినిమాను ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
జనవరి 23వ తేదీ నుంచి ఈ సినిమాను అధికారికంగా స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించింది. దీంతో, సుదీప్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, థియేటర్స్ లో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా చూడలేకపోయారు. కాబట్టి, మార్క్ సినిమా తెలుగు వెర్షన్ కి మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. మరి ఓవరాల్ గా మార్క్ సినిమాకు ఓటీటీలో ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.