kid steps for Chiranjeevi song and simran tweet on her dance
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చే విషయం చిరు డాన్సులు. ఒకప్పుడు సినిమాలో పాట వస్తుంది అంటే థియేటర్ లోని ఆడియన్స్ బయటకి వెళ్లి వచ్చేవారట. కానీ చిరంజీవి వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేకంగా డాన్సులు చూడడానికే థియేటర్ లకి ప్రేక్షకులు వెళ్లడం స్టార్ట్ చేశారు అంటూ ఒకప్పటి తరం వాళ్ళు చెబుతుంటారు. అయితే మన ముందు తరం వాళ్ళు చెప్పే అన్ని విషయాలు నమ్మేలా ఉండవు, కానీ చిరంజీవి విషయంలో చెప్పే ప్రతి మాట నిజమని ఇప్పటి సంఘటనలు నిరుపిస్తుంటాయి. అలాంటి ఒక నిదర్శనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Bhola Shankar : భోళా శంకర్ పోస్టర్ పై దారుణమైన ట్రోల్స్.. మెహర్ రమేష్ ని ఆడేసుకుంటున్న మీమర్స్..
20’s కి చెందిన ఒక చిన్నారి చిరంజీవి ‘అన్నయ్య’ సినిమాలోనే ‘ఆట కావాలా, పాట కావాలా’ అనే సాంగ్ కి అదిరే స్టెప్పులు వేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. సినిమాలో చిరుతో కలిసి ఈ పాటలో సిమ్రాన్ (Simran) డాన్స్ చేసింది. ఇక ఈ వీడియో సిమ్రాన్ వరకు చేరడంతో, ఆమె ఈ వీడియోకి రియాక్ట్ అవుతూ ట్వీట్ చేసింది. ”ఓరి దేవుడా, తన ఎనర్జీ చూడండి” అంటూ హార్ట్ సింబల్స్ తో ట్వీట్ చేసింది. దీంతో ఈ వీడియో మరింత వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో కాస్త చిరంజీవి వరకు చేరుతుందా? అనేది చూడాలి.
కాగా చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ (Bhola Shankar) సినిమాలో నటిస్తున్నాడు. తమిళ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి ఇది రీమేక్. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రం కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ కీర్తిసురేష్ చిరుకి చెల్లిగా కనిపించనుంది. ఈ సినిమాని ఆగష్టు 11న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
Oh my god ?look at that energy ????❤️?❤️?❤️?❤️?❤️????? https://t.co/RB6HnydfRx
— Simran (@SimranbaggaOffc) March 22, 2023