అనుష్క ఫిల్మ్ ‘సైలెన్స్’ లో హాలీవుడ్ నటుడు

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 06:32 AM IST
అనుష్క ఫిల్మ్ ‘సైలెన్స్’ లో హాలీవుడ్ నటుడు

గతేడాది ‘భాగమతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ చేస్తూ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ “సైలెన్స్”లో నటిస్తోంది. అనుష్క‌, మాధ‌వ‌న్ కాంబినేష‌న్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ‘ సైలెన్స్’. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా 100కి పైగా సినిమాల్లో న‌టించిన ‘కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్’ తొలిసారి ఈ ఇండియ‌న్ మూవీలో న‌టిస్తున్నారు.
Read Also : ‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ విడుదల వాయిదా: ప్రకటించిన వర్మ

ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. కోన వెంకట్ నిర్మాణంలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ థ్రిల్లింగ్ సినిమా ప్లాన్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థతో క‌లిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇందులో అనుష్క ఓ దివ్యాంగరాలి పాత్రలో కనిపిస్తుందని సమాచారం.
  
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంద‌ర్నీ త‌ప్పకుండా ఎంట‌ర్‌టైన్ చేస్తుందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ CEO విశ్వప్రసాద్ తెలిపారు. అమెరికలోని సీయోట‌ల్ లో ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు షూటింగ్ చేయ‌నున్నాం. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ఈ మూవీ టీజ‌ర్ ను మేలో గ్రాండ్ గా అమెరికలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. 
Read Also : శ్రీ దేవి బయోపిక్ లో బాలీవుడ్‌ హీరోయిన్‌!