సంతోషాలు, సరాదాలు, కోపాలు, ఆవేశాలు, గొడవలు, గ్రూపులు, కన్నీళ్లు, అనుబంధాలు, ఆప్యాయతలు, ఏడుపులు, ఈర్షలు అన్నట్లుగా సాగుతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. 47రోజులు పూర్తి చేసుకుని 50రోజులకు దగ్గర అవుతుంది. ఈ క్రమంలో గతవారం కింగ్ నాగార్జున బదులు రమ్యకృష్ణ షో హోస్ట్ చేయగా.. ఈ వారం తిరిగి మళ్లీ కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చేశాడు.
ఈ వారం కింగ్ నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే హాట్ హాట్ డిస్కషన్ నడిపారు. దొంగలు దోచిన నగరం టాస్క్ లో జరిగిన హింస గురించి ప్రస్తావించిన నాగార్జున.. అలీరెజా, పునర్నవిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాస్క్ ఆగిపోయిందంటే బిగ్ బాస్ గీసిన గీత దాటినట్లే అంటూ అసహనం వ్యక్తం చేశారు. దొంగలు దోచిన నగరం టాస్క్‌లో రాహుల్ కాలికి గాయమై రక్తం కారింది. నిధిని కాపాడే ప్రయత్నంలో శివజ్యోతి, రవి చాలా కష్టపడ్డారు. వరుణ్-వితికాలు గొడవపడ్డారు. శ్రీముఖి.. పునర్నవిని పట్టుకోవడం, హిమజ.. శిల్పాను పట్టుకోవడం పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే నాగార్జున కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యారు.
ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ లో రాహుల్, అలీ రెజా డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్లిద్దరిలో ఒకరు షో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వారం లైట్స్ ఆన్ అంటూ ఐదుగురు కంటెస్టెంట్లను నిలబెట్టి ఒకరిని ఎలిమినేట్ చేయనున్నట్లు తెలుస్తుంది.