Bigg Boss 4 Telugu: చార్టెర్డ్ ఫ్లైట్‌లో స్టైలిష్‌గా కింగ్ నాగ్!

  • Publish Date - October 31, 2020 / 05:09 PM IST

Bigg Boss 4: ‘కింగ్‌’ నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 డిఫరెంట్ టాస్కులతో రసవత్తరంగా సాగుతోంది. నాగ్ ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్‌ కోసం మనాలీ వెళ్లగా అక్కినేని కోడలు సమంత దసరా ఎపిసోడ్ హోస్ట్ చేశారు. మూడు వారాల పాటు షూటింగ్ కొనసాగనున్నట్లు నాగార్జున చెప్పడంతో ఆయన వచ్చే వరకు సమంతనే హోస్ట్ చేస్తుందనుకున్నారు.కట్ చేస్తే కింగ్ ఫ్రేమ్‌లోకి ఎంటరైపోయాడు. వీకెండ్స్‌లో షూటింగ్‌లో పాల్గొనేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు నాగార్జున కోసం స్పెషల్‌గా చార్టెర్డ్ ఫ్లైట్ బుక్ చేశారు. ఫ్లైట్‌లో నాగ్ హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్న వీడియో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


King Nagarjuna is back ఇప్పుడు నాగార్జున రాకతో వారం పాటు నాగ్ లేకుండా హౌస్‌లో ఎంజాయ్ చేసిన ఇంటి సభ్యులకు ఆయన ఎలాంటి టాస్కులు ఇవ్వనున్నారు.. ఎవరికి క్లాస్ పీకనున్నారు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.