KA Movie Collections : అదరగొట్టిన కిరణ్ అబ్బవరం.. ‘క’ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా.. కిరణ్ కెరీర్ హైయెస్ట్..

తాజాగా క సినిమా రెండు రోజుల కలెక్షన్స్ అనౌన్స్ చేసారు.

Kiran Abbavaram Ka Movie Two Days Worldwide Collections details Here

KA Movie Collections : గత కొన్ని సినిమాలతో ఫ్లాప్స్ చూసిన కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి ‘క’ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా తన్వి రామ్ ముఖ్య పాత్రలో సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వంలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన క సినిమా అక్టోబర్ 31న రిలీజయి మంచి విజయం సాధించింది.

సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఎవరూ ఊహించలేని క్లైమాక్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసారు క సినిమాతో. దీంతో క సినిమాకు థియేటర్స్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. దీనికి తోడు దీపావళి సెలవులు కూడా కలిసి రావడంతో క కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. క మొదటి రోజే 6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి కిరణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.

Also Read : Prasanth Varma – Venky Atluri : సినిమా హిట్.. అప్పుడు ప్రశాంత్ వర్మ తండ్రి.. ఇప్పుడు వెంకీ అట్లూరి తండ్రి.. ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్..

తాజాగా క సినిమా రెండు రోజుల కలెక్షన్స్ అనౌన్స్ చేసారు. కిరణ్ అబ్బవరం క సినిమా రెండు రోజుల్లో ఏకంగా 13.11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది కిరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్. రెండు రోజుల్లోనే క సినిమా 13 కోట్లు కలెక్ట్ చేసిందంటే నేడు, రేపు వీకెండ్ ఉండటంతో ఈ సినిమా ఈజీగా 30 కోట్ల వరకు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అమెరికాలో కూడా ఇప్పటికే కిరణ్ 330K+ డాలర్స్ వసూలు చేసాడు క సినిమాతో. త్వరలో 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసి క తోనే కిరణ్ కెరీర్లో మెరికాలో మొదటి 1 మిలియన్ సినిమాగా నిలుపుతాడేమో చూడాలి. మొత్తానికి కిరణ్ చెప్పి మరీ హిట్ కొట్టాడు.