Rules Ranjann : మళ్ళీ వాయిదా వేసుకున్న కిరణ్ అబ్బవరం.. రూల్స్ రంజన్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
మళ్ళీ కిరణ్ అబ్బవరం ఏమనుకున్నాడో కానీ తన సినిమాని వాయిదా వేసుకున్నాడు.
- Saketh U
- Published On : September 12, 2023 / 12:03 PM IST
Kiran Abbavaram Neha Shetty Rules Ranjann Movie New Releasing Date
Rules Ranjann : టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే త్వరలో కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) సినిమాతో రాబోతున్నాడు. రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయిక. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుంచి వచ్చిన సమ్మోహనుడా అనే సాంగ్ బాగా వైరల్ అయింది. అయితే రూల్స్ రంజన్ సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడి ప్రభాస్ సలార్ తప్పుకోవడంతో సెప్టెంబర్ 28న వస్తామని ఇటీవల ప్రకటించారు. కానీ సలార్ తప్పుకోవడంతో ఆ డేట్స్ లోకి స్కంద, ది వ్యాక్సిన్ వార్, మ్యాడ్, పెదకాపు సినిమాలు వచ్చాయి. దీంతో మళ్ళీ కిరణ్ అబ్బవరం ఏమనుకున్నాడో కానీ తన సినిమాని వాయిదా వేసుకున్నాడు.
రూల్స్ రంజన్ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుందని కొత్త డేట్ ని ప్రకటిచారు చిత్రయూనిట్. త్వరలో ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. మరి ఈ సారైనా చెప్పిన డేట్ కి వస్తుందా? లేక రూల్స్ రంజన్ మళ్ళీ వాయిదా పడుతుందా చూడాలి.
