Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. తొలిప్రేమేం తోపుకాదు.. మరో కల్ట్ సినిమా తెస్తున్న ‘బేబీ’ కాంబో..

తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Kiran Abbavaram Producer SKN Gouri Priya New Movie Title and Glimpse Released

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం క సినిమాతో హిట్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాని బేబీ నిర్మాత SKN నిర్మిస్తుండగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఇచ్చిన కథతో రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్నాడు.

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ‘చెన్నై లవ్ స్టోరీ’ అని ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ గ్లింప్స్ లో కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ చెన్నై సముద్రం ఒడ్డున కూర్చొని ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే చెన్నైలో జరిగే లవ్ స్టోరీ కథతో మరో కల్ట్ సినిమా తీసుకురాబోతున్నారు అని తెలుస్తుంది.

Also Read : Tuk Tuk : ఓటీటీలో దూసుకుపోతున్న చిన్న సినిమా.. స్కూటర్ లో ఉండే ఆత్మ ఎవరిది?

మీరు కూడా చెన్నై లవ్ స్టోరీ గ్లింప్స్ చూసేయండి..

ఈ గ్లింప్స్ ని సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు.