Kishkindapuri movie to be streamed on OTT from October 17th
Kishkindhapuri OTT: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కించాడు. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించాడు. టీజర్, ట్రైలర్ తోనే సూపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది. ఈ సినిమాకు (Kishkindhapuri OTT)ఆడియన్స్ నుంచి యునానిమస్ పాజిటీవ్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ.23 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది.
Mahesh Babu: దర్శకధీరుడి పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు
చాలా కాలం తరువాత కిష్కిందపురి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి కంబ్యాక్ ఇచ్చింది అనే చెప్పాలి. నిజానికి, ఈ సినిమాతో పాటు మిరాయ్ సినిమా కూడా థియేటర్స్ లోకి వచ్చింది. ఆ సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఆ ఎఫెక్ట్ కిష్కింధపూరి సినిమాపై పడింది. కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. లేదంటే, ఈ సినిమాకు వచ్చిన టాక్ కి ఖచ్చితంగా రూ.50 కోట్ల మార్క్ దాటేది అంటూ ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన టాక్. ఇదిలా ఉంటే, తాజాగా కిష్కిందపురి సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.
సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు నెల తరువాత అక్టోబర్ 17న ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో, ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు థియేటర్స్ లో పాజిటీవ్ టాక్ వచ్చింది కాబట్టి, ఓటీటీలో మరింత రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో అక్టోబర్ 17న తెలుస్తుంది.
The scare will see you and find your fears!
Get ready for #KishkindhapuriOnZee5 on #ZEE5Telugu
🎬 World OTT & Television Premiere – Don’t miss it!@BSaiSreenivas @anupamahere @Koushik_psk @sahugarapati7 @chaitanmusic @Shine_Screens pic.twitter.com/wTVtxBNHpf— ZEE5 Telugu (@ZEE5Telugu) October 10, 2025