×
Ad

Vijay Rashmika : విజయ్ – రష్మిక.. సినిమాలు కాకుండా ఎవరికి ఏం బిజినెస్ లు ఉన్నాయో తెలుసా?

ఈ ఇద్దరూ కూడా సినిమాల్లో సంపాదిస్తూనే బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. (Vijay Rashmika)

  • Published On : February 24, 2026 / 06:30 PM IST

Vijay Deverakonda Rashmika Mandanna

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల నుంచి వచ్చి సినిమాల్లో సక్సెస్ అయిన వాళ్ళే. గత కొన్నేళ్ళుగా ప్రేమించుకున్న ఈ జంట ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో ఈ ఇద్దరి గురించి పలు వార్తలు వైరల్ గా మారాయి. రష్మిక – విజయ్ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. త్వరలో రణబాలి సినిమాలో నటిస్తున్నారు.

అందరు సినీ సెలబ్రిటీల లాగానే ఈ ఇద్దరూ కూడా సినిమాల్లో సంపాదిస్తూనే బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.

Also Read : Prabhas : మీరు ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా.. అందరూ అనుకునేది అబద్దం.. ప్రభాస్ పై సంతోష్ శోభన్ కామెంట్స్ వైరల్..

విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని సమాచారం. 2017లో విజయ్ రౌడీ అనే క్లాతింగ్ బ్రాండ్ ని స్థాపించాడు. ఎక్కువ ఖరీదు ఉన్న బట్టలు దీని స్పెషల్. సెలబ్రిటీలకు ఫ్రీగా తన రౌడీ బ్రాండ్ డ్రెస్ లని పంపించి బాగానే ప్రమోట్ చేసుకున్నాడు. విజయ్ కి కింగ్ ఆఫ్ హిల్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ నిర్మాణ సంస్థపై ఇప్పటికే రెండు సినిమాలు నిర్మించారు. త్వరలో మరిన్ని సినిమాలు నిర్మించబోతున్నారు.

విజయ్ కి మహబూబ్ నగర్ లో AVD సినిమాస్ అనే థియేటర్ ఉంది. అలాగే వాట్స్ & వోల్ట్స్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసాడు. హైదరాబాద్ హాక్స్ అనే వాలీబాల్ టీమ్ కి కో ఫౌండర్ కూడా విజయ్. 2019 లోనే విజయ్ ఫోర్బ్స్ ఇండియా అండర్ 30లో లిస్టయ్యాడు. ఇవి కాకుండా అనేక బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇలా విజయ్ ఓ పక్క సినిమాలు చేస్తూనే బిజినెస్ లతో కూడా సంపాదిస్తున్నాడు.

Also See : కోర్ట్ ఫేమ్ శ్రీదేవి – రోషన్ కొత్త సినిమా.. ‘బ్యాండ్ మేళం’ టీజర్ వచ్చేసింది..

రష్మిక సినిమాకు 5 నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. షాప్ ఓపెనింగ్స్, బ్రాండ్ అంబాసిడర్ గా బాగానే సంపాదిస్తుంది. ప్లమ్ అనే స్కిన్ కేర్ బ్రాండ్ లో రష్మిక ఇన్వెస్ట్ చేసింది. ఇటీవలే డియర్ డైరీ అనే పర్ఫ్యూమ్ బ్రాండ్ బిజినెస్ ని మొదలుపెట్టింది. రష్మిక గత సంవత్సరం 4.69 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింది. తన జిల్లాలోనే అత్యధిక ట్యాక్స్ కట్టిన సిటిజన్ గా రికార్డ్ సెట్ చేసింది.

ఇలా విజయ్ – రష్మిక సినిమాల్లోనే కాకుండా బయట కూడా బిజినెస్ లతో సంపాదిస్తూ ఇద్దరూ మంచి కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లితో ఒక్కటైతే వీరి సంపాదన మరింత పెరగనుంది.