Tamannaah : బాక్సింగ్ రింగ్‌లో మిల్కీ బ్యూటీ అందాలవిందు..
సంక్రాంతి కానుకగా వరుణ్ తేజ్ ‘గని’ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా చేస్తున్న స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు..
- sekhar
- Published On : January 15, 2022 / 11:44 AM IST
Tamannaah
Tamannaah: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న మూవీ ‘గని’. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Ghani Teaser : ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్.. గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావ్..
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసిన టీజర్‌కి చక్కటి రెస్పాన్స్ వచ్చింది.
Ghani Movie : క్రిస్మస్ నుండి సమ్మర్‌కి..
సంక్రాంతి కానుకగా ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా చేస్తున్న స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. లిరికల్ వీడియోలో బాక్సింగ్ రింగ్‌లో అందాల ఆరబోతతో అలరించింది తమన్నా. తమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స రాశారు. హారిక నారాయణన్ పాడారు. పియూష్-సాజియా కొరియోగ్రఫీ చేశారు. పాట లిరికల్‌గానూ విజువల్‌గానూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మూవీ టీం చెప్తున్నారు. మార్చి 18న ‘గని’ థియేటరల్లో బాక్సింగ్ పంచెస్ విసరబోతున్నాడు.
