Ghani Movie : క్రిస్మస్ నుండి సమ్మర్‌కి..

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ ‘గని’ మూవీ న్యూ రిలీజ్ డేట్..

Ghani Movie : క్రిస్మస్ నుండి సమ్మర్‌కి..

Ghani Movie

Updated On : December 25, 2021 / 3:04 PM IST

Ghani Movie: మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా, ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్న మూవీ ‘గని’. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

Telangana Movie Tickets Rate : సినిమా టికెట్ రేట్లపై కొత్త జీవో.. కేసీఆర్‌కు చిరు కృతఙ్ఞతలు

బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర, జగపతి బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసిన టీజర్‌కి చక్కటి రెస్పాన్స్ వచ్చింది.

Ghani Teaser : ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్.. గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావ్..

ముందుగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమాను విడుదల చెయ్యాలనుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. రీసెంట్‌గా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2022 మార్చి 18న ‘గని’ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు.