Ghani Teaser : ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్.. గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావ్..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వాయిస్‌తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ టీజర్..

Ghani Teaser : ఆడినా ఓడినా రికార్డ్స్‌లో  ఉంటావ్.. గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావ్..

Ghani Teaser

Updated On : November 15, 2021 / 2:55 PM IST

Ghani Teaser: మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్న మూవీ ‘గని’. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

Akhanda Trailer Roar : ఇదీ బాలయ్య మాస్ ర్యాంపేజ్!

బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర, జగపతి బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. సోమవారం ‘గని’ టీజర్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.

Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..

చరణ్ వాయిస్ ఓవర్‌తో కట్ చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. సినిమా సినిమాకి యాక్టర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని తాపత్రయ పడే వరుణ్.. ‘గని’ తో మరోసారి ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమనిపించేలా ఉంది టీజర్.

Pooja Hegde : మాల్దీవుల్లో రచ్చ చేస్తుందిగా..

జార్జ్ సి. విలియమ్స్ విజువల్స్, యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. నదియా, వీకే నరేష్, తనికెళ్ల భరణి ఇతరపాత్రలు పోషించారు. డిసెంబర్ 24న థియేటర్లలో ‘గని’ బాక్సింగ్ పంచెస్ ఇవ్వబోతున్నాడు.