గుండెపోటుతో తమిళ నటుడు మృతి

తీవ్రమైన గుండెపోటురావడంతో కోలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ జేకే రితీష్‌ (46) హఠాత్తుగా మరణించారు.

  • Publish Date - April 13, 2019 / 12:54 PM IST

తీవ్రమైన గుండెపోటురావడంతో కోలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ జేకే రితీష్‌ (46) హఠాత్తుగా మరణించారు.

కోలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ జేకే రితీష్‌ (46) హఠాత్తుగా మరణించారు. తీవ్రమైన గుండెపోటురావడంతో ఏప్రిల్ 13 శనివారం ఆయన మృతి చెందారు. 2009 లోక్ సభ ఎన్నికలలో డీఎంకే ఎంపీ అభ్యర్థిగా రామనాథపురం నుంచి ఎంపీగా ఎంపిక అయ్యారు. రితీష్‌ అకాల మరణంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక‍్తం చేశారు.
Read Also : కొంప, కుటుంబం వద్దా రా : 12 గంటల డ్యూటీ చేసిన చైనా కంపెనీలు

ఆర్‌జే బాలాజీ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం, రాజకీయ వ్యంగ్య చిత్రం ‘ఎల్‌కేజీ’లో రితీష్ కీలక పాత్రను పోషించారు. హాస్య ప్రధాన, పొలిటికల్‌ సెటైర్‌గా ఈ చిత్రం రూపొందింది. ప్రధానంగా కొందరు రాజకీయ నేతలపై సెటైర్ల సన్నివేశాలతో కూడిన ఈ చిత్ర ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. 
Read Also : Be Alert : మీ 2G.. PoS మిషన్స్ Upgrade చేయండి