Komatireddy Venkat Reddy : టాలీవుడ్ లో ప్రస్తుతం అనధికార సమ్మె నడుస్తుంది. ఏకంగా వేతనాలు 30 శాతం పెంచేదాకా సినీ కార్మికులు ఎవరూ షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ చెప్పడంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఫిలిం ఛాంబర్, నిర్మాతలు ఈ సమస్య పరిష్కారానికి ట్రై చేస్తున్నారు. పలువురు నిర్మాతలు నేడు చిరంజీవిని కలిసి ఈ సమస్య గురించి కూడా మాట్లాడారు.
Also Read : Dhanush – Mrunal Thakur : నిజంగానే ధనుష్ – మృణాల్ డేటింగ్ చేస్తున్నారా? ముంబైలో మీటింగ్..
తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ టాలీవుడ్ సమ్మెపై స్పందించారు. కోమటిరెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో బతకాలంటే జీతాలు పెరగాలి. ఢిల్లీ పర్యటన తర్వాత నేను కార్మికులతో మాట్లాడతాను. కార్మికుల అంశాలు తెలుసుకొని పరిశీలించాలని దిల్ రాజుకు సూచించాను. ఆయన దీనిపై చర్చిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. టికెట్ల ధరలు పెంచేందుకు మేము అనుమతులు ఇస్తున్నాం. కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు.
Also Read : Chiranjeevi : టాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్.. మెగాస్టార్ తో నిర్మాతల భేటీ.. చిరంజీవి ఏమన్నారంటే..