Kona Venkat : ఆ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగులో లేడీ డైరెక్టర్స్ తక్కువ.. ఎందుకంటే..

Kona Venkat Shocking Comments on Telugu Lady Directors

Kona Venkat : టాలీవుడ్ టాప్ రైటర్స్ లో ఒకరైన కోన వెంకట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇతర ఇండస్ట్రీలో కంటే తెలుగులో లేడీ డైరెక్టర్స్ ఎందుకు తక్కువ అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. బయట ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ మగవారికి సమానంగా పోటీ పడుతున్నారు. కానీ తెలుగు ఇండస్ట్రీ లో మాత్రం తక్కువ ఉన్నారు ఎందుకని అడిగితే.. ఎందుకు మన తెలుగులో కూడా లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. ఒకప్పుడు ఉండే వారని అన్నారు.

ఈ మధ్య కాలంలో ఏంటంటే..ముఖ్యంగా సౌత్ ఇండియన్ కల్చర్ లో ఇలాంటి వాటికి అంత త్వరగా ఒప్పుకోరు. కానీ ఇప్పుడిప్పుడే ఇంట్లో నుండి బయటికి వచ్చి అన్ని తెలుసుకుంటున్నారు. అందరితో సమానంగా పోటీ పడుతున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సహం, హీరోలు వాళ్లకి ఛాన్స్ ఇవ్వడం వంటి వాటి వల్ల ఇప్పుడిప్పుడు అందరూ బయటికి వస్తున్నారు అని అన్నారు కోన వెంకట్.

Also Read : Kona Venkat : ఒక్క పూట భోజనం చేసైనా ఉంటా.. అనుకుంటేనే ఇండస్ట్రీకి రండి.. లేకపోతే..

అంతేకాకుండా సౌంత్ ఇండియన్స్ లో .. చాలా మంది వాళ్ళ ట్యాలెంట్ ను గుర్తించరు. అమ్మాయి, అబ్బాయి అన్న తేడాలు చూపిస్తారు. ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి ఇండస్ట్రీ నుండి సరైన సపోర్ట్ ఉండదు. అందుకే అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ గా సక్సెస్ అవ్వడం కష్టం అన్నారు కోన వెంకట్.