Koratala Siva come to Promotions for Satya Dev before NTR Devara Movie
Koratala Siva : దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమా ఫెయిల్ అవ్వడంతో హిట్ కొట్టాలనే ఫుల్ కసితో ఎన్టీఆర్ తో దేవర(NTR Devara) సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దేవర సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీగా అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో చివరిసారిగా బయట కనపడ్డారు.
ఆ తర్వాత దేవర సినిమా ఓపెనింగ్ రోజు తప్ప మళ్ళీ బయట ఎక్కడా కనపడలేదు. దేవర సినిమా ప్రమోషన్స్ లోనే కొరటాల శివ మళ్ళీ మీడియా ముందుకు వస్తాడేమో అనుకున్నారు. కానీ కొరటాల శివ దేవర కంటే ముందే మీడియా ముందుకు రాబోతున్నారు. సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ సినిమా కోసం కొరటాల శివ రాబోతున్నారు.
Also Read : Pushpa 2 : పుష్ప 2 నుంచి సాంగ్ కంటే ముందు ఓ సర్‌ప్రైజ్ రాబోతుంది.. ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో..?
విజయవాడ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా సత్యదేవ్(Satya Dev) మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా కృష్ణమ్మ. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి మంచి హైప్ ఇచ్చారు. ఈ సినిమా నిర్మాణంలో కొరటాల శివ కూడా భాగమయ్యారు. కృష్ణమ్మ సినిమా కొరటాల శివ ప్రజెంట్స్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో కొరటాల శివ కృష్ణమ్మ సినిమా ప్రమోషన్స్ లో భాగమవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి సత్యదేవ్ కృష్ణమ్మ సినిమా ప్రమోషన్స్ లో కొరటాల వస్తే దేవర సినిమా గురించి ఏమైనా అప్డేట్స్ ఇస్తాడేమో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.