Pushpa 2 : పుష్ప 2 నుంచి సాంగ్ కంటే ముందు ఓ సర్‌ప్రైజ్ రాబోతుంది.. ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో..?

తాజాగా పుష్ప టీం తమ ట్విట్టర్ లో ప్రోమో విడుదల చేసాం, సాంగ్ రాబోతుంది. దానికంటే ముందు మీకు ఒక సర్‌ప్రైజ్ ఉండబోతుంది అని ట్వీట్ చేశారు.

Pushpa 2 : పుష్ప 2 నుంచి సాంగ్ కంటే ముందు ఓ సర్‌ప్రైజ్ రాబోతుంది.. ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో..?

Pushpa 2 Movie ready to give a Surprise to Fans before first song Release

Updated On : April 25, 2024 / 12:59 PM IST

Pushpa 2 : పుష్ప 2 సినిమా కోసం బన్నీ అభిమానుల నుంచి దేశంలోని సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా పెద్ద హిట్ అవ్వడం, సాంగ్స్, మేనరిజం వైరల్ అవ్వడం, అల్లు అర్జున్(Allu Arjun) కి నేషనల్ అవార్డు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలు అందుకోడానికి సుకుమార్ గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇప్పటికే పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ ఇచ్చారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

నిన్న పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మే 1న ఉదయం 11.07 గంటలకు ఫుల్ సాంగ్ విడుదల చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. అయితే దానికంటే ముందే ఒక సర్‌ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు. తాజాగా పుష్ప టీం తమ ట్విట్టర్ లో ప్రోమో విడుదల చేసాం, సాంగ్ రాబోతుంది. దానికంటే ముందు మీకు ఒక సర్‌ప్రైజ్ ఉండబోతుంది అని ట్వీట్ చేశారు.

Also Read : Prasanna Kumar Bezawada : జాబ్ లేకపోయినా రెండేళ్లు ఇంటికి శాలరీ పంపించిన స్టార్ రైటర్.. పాపం ఎన్ని కష్టాలు పడ్డాడో..

దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి ఆ సర్‌ప్రైజ్ ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ డాన్స్ స్టెప్ ఒకటి మళ్ళీ ఇంకో ప్రోమో రూపంలో సాంగ్ రిలీజ్ చేసే ముందు విడుదల చేస్తారని టాక్ వినిపిస్తుంది. మరి పుష్ప సినిమా నుంచి ఆ సర్‌ప్రైజ్ ఏంటో? ఎప్పుడు ఇస్తారో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.