రీసెంట్‌గా ‘సీత’ మూవీ నుండి ‘కోయిలమ్మ’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌జంటగా.. తేజ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ.. సీత.. ATV సమర్పణలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సీత థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ‘కోయిలమ్మ’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం.. ‘కుహూ కుహూ అని కోయిలమ్మ, తియ్యగ నిన్నే పిలిచిందమ్మా.. కోపం చాలమ్మా.. బదులుగ నవ్వొకటివ్వమ్మా’.. అంటూ సాగే ఈ కూల్ మెలొడీ సింపుల్‌గా వినడానికి బాగుంది.
అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ట్యూన్‌కి లక్ష్మీ భూపాల లిరిక్స్ రాయగా అర్మాన్ మాలిక్ పాడాడు. రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సీత, మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనూసూద్, తనికెళ్ళ భరణి, అభిమన్యు సింగ్, మన్నారా చోప్రా తదితరులు నటించిన ఈ సినిమాకి ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, మాటలు : లక్ష్మీ భూపాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్స్ : అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్.
వాచ్ లిరికల్ సాంగ్..