ఒరేయ్ అప్పిగా సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంటి రా.. నా..

మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘క్రాక్’ టీజర్..

  • Publish Date - February 21, 2020 / 01:42 PM IST

మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘క్రాక్’ టీజర్..

మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్..  ‘క్రాక్’.. హీరోగా రవితేజ 66వ సినిమా ఇది.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజతో చేస్తున్న హ్యాట్రిక్ ఫిలిం. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘క్రాక్’ టీజర్ రిలీజ్ చేశారు.

మాస్ మహారాజా తన స్టైల్ యాక్షన్‌తో చెలరేగిపోయాడు. ‘ఒంగోలులో రాత్రి ఎనిమిది గంటలకి కరెంట్ పోయిందంటే.. కచ్చితంగా మర్డరే’.. అనే డైలాగుతో ప్రారంభమైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో రవితేజ రఫ్ఫాడించేశాడు. సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తుంది.

శృతిహాసన్ కాలి బొటన వేలితో రవితేజ మీసం తిప్పే షాట్ బాగుంది. ‘ఒరేయ్ అప్పిగా, సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంటి రా.. నా టొప్పిగా’.. అంటూ రవితేజ తన స్టైల్ మాడ్యులేషన్‌లో చెప్పిన డైలాగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జి.కె. విష్ణు విజువల్స్, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. Meet the #Krack Cop in this summer అంటూ చిత్రాన్ని మే 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

డైలాగ్స్ : సాయిమాధవ్ బుర్రా
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్ : ఎస్. థమన్
సినిమాటోగ్రఫీ : జి.కె.విష్ణు
ఎడిటింగ్ : నవీన్ నూలి
ఫైట్స్ : రామ్-లక్ష్మణ్.

Read More>>తన కజిన్ పంజా వైష్ణవ్ తేజ్‌ను పరిశ్రమలోకి ఆహ్వానించిన చరణ్