దర్శకుడు మనోజ్‌ను పెళ్లాడిన షాలిని..

  • Publish Date - August 23, 2020 / 06:52 PM IST

Actres Shalini Wedding: ఈమధ్య ఓటీటీలో విడుద‌లైన మంచి విజ‌యం సాధించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా హీరోయిన్‌ షాలిని వడ్నికట్టి పెళ్లి చేసుకుంది. ఆ సినిమాలో రాధ పాత్రలో అలరించిన షాలిని.. ట్రెడిషనల్‌గా క‌నిపిస్తూనే గ్లామ‌ర్‌తోనూ ఆక‌ట్టుకుంది. ఒక్క సినిమాతోనే ఎంతోమందిని ఆమెకు ఫ్యాన్స్‌గా మారారు. ‘భానుమతి అండ్ రామకృష్ణ’లోనూ కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. షాలిని సడన్‌గా పెళ్లి చేసుకొని అందరికి సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్ ఇచ్చింది.



కరోనా కారణంగా పెద్దగా బంధువులు, స్నేహితుల హడావుడి లేకుండా పెళ్లి జరిగింది. షాలిని త‌మిళ ద‌ర్శ‌కుడు మనోజ్ బీదను వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ప్లస్’ అనే కన్నడ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన షాలిని.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.

నటిగా ఇప్పుడిప్పుడే మంచి పేరుతో పాటు అవకాశాలు దక్కించుకుంటున్న షాలిని మరోవైపు హీరోయిన్‌గా కూడా నటిస్తుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకొని ఊహించని షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా సినీ వర్గాలవారు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.