Krishna Fans are gathered at Padmalaya Studios to pay last respects to their hero
Super Star Krishna : టాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన ‘కృష్ణ’ మరణంతో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకి నివాళ్లు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఇక అభిమానుల సందర్శనార్ధం ఈరోజు ఉదయం కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్ కి తరలించారు. దీంతో అభిమానులు స్టూడియో వద్దకు భారీగా తరలి వస్తున్నారు.
Superstar Krishna Passed Away : నేడు తెలుగు సినీ పరిశ్రమ బంద్.. నిర్మాత మండలి!
అయితే కొంతమంది అభిమానులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కృష్ణ అంతిమయాత్ర మొదలు కావాల్సి ఉంది. ఈమద్యలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా నివాళ్లు అర్పించేందుకు రానున్నారు. దీంతో కొంతమంది అభిమానులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం ఈ విషయంపై ఆవేదన చెందుతున్నారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసుకునే వీలు కలిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపద్యమంలో అభిమానులు, పోలీస్ ల మధ్య కొంత తోపులాట జరిగింది. కాగా మధ్యాహన సమయంలో కృష్ణ పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబిలీహిల్స్ మహాప్రస్థానికి అంతిమయాత్రగా తీసుకువెళ్లనున్నారు. సుమారు 3 గంటలు సమయంలో కృష్ణ అంత్యక్రియలు అధికార లాంఛనాలు మధ్య నిర్వహించనున్నారు.