Krishna made his political debut with the call of Rajiv Gandhi
Krishna : నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగుతెరపై ఎన్నో సేవలు అందించిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సినిమాలోనే కాదు కృష్ణ గారు ఒక్కపాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజకీయవేత్త. కాగా నిన్న అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన కృష, ఈరోజు తుది శ్వాస విడిచారు.
Super Star Krishna : టాలీవుడ్ కి కొత్తదనాన్ని పరిచయం చేసి.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు కృష్ణ..
ఇక సినిమాల్లో డేరింగ్ అండ్ డాషింగ్ గా నిర్ణయాలు తీసుకునే ఈ హీరో రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రభంజనం సృష్టిస్తున్న సమయంలో.. అప్పటి ప్రధానిమంత్రి రాజీవ్ గాంధీ పిలుపు మేరకు రాజకీయ అరగేంట్రం చేశారు. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపుని సొంతం చేసుకున్నారు.
అంతేకాదు ఆ సమయంలో కృష్ణ గారు నటించిన కొన్ని సినిమాలు ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి వేతిరేకంగా ఉండేవని అప్పటిలో పెద్ద చర్చే జరిగేది. అయితే రాజీవ్ గాంధీ మరణం తరువాత వచ్చిన బై ఎలక్షన్స్ లో పరాజయం పాలు అవ్వడంతో, కొన్నలుపాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మళ్ళీ వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.