బంగారు తల్లి గురించి విన్నాం.. ఈరోజు చూశాం – కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి

విజయనిర్మల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి..

  • Published By: sekhar ,Published On : February 20, 2020 / 08:29 AM IST
బంగారు తల్లి గురించి విన్నాం.. ఈరోజు చూశాం – కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి

Updated On : February 20, 2020 / 8:29 AM IST

విజయనిర్మల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి..

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా కృష్ణ విజయ నిర్మల నివాసంలో జరిగిన  కార్యక్రమంలో విజయనిర్మల విగ్రహాన్ని కృష్ణ ఆవిష్కరించారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి, విజయ నిర్మల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, విజయ నిర్మలతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘విజయ నిర్మల ‘సుల్తాన్’ సినిమా షూటింగు అప్పుడు మాకు వంట చేసి పెట్టేవారు. ప్రతి తల్లీ బంగారు తల్లి అని అనుకోవడం విన్నాం కానీ స్వయంగా ఆ బంగారు తల్లిని మనకి చూపించారు నరేష్ గారు. ఆవిడ ఆశీస్సులు మనకెప్పుడూ ఉండాలి.. కృష్ణ, విజయ నిర్మల గార్ల అనుబంధం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం’’ అన్నారు.

విజయ నిర్మల స్త్రీ శక్తి అవార్డు పురస్కరాన్ని డైరెక్టర్ నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేష్ బాబు కలిసి అందచేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, మురళీమోహన్, మహేష్ బాబు, నమ్రత, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, గల్లా జయదేవ్, నిర్మాత పివిపి, పరుచూరి గోపాల కృష్ణ, ఆదిశేషగిరరావు, శివకృష్ణ, మారుతి, నందిని రెడ్డి బ్రహ్మాజీ, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Vijaya Nirmala Statue Inauguration Ceremony

 

Read More>>విజయ నిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించిన సూపర్‌స్టార్ కృష్ణ