Krishnam Raju: క్షత్రియ సంప్రదాయ పద్దతిలో ముగిసిన కృష్ణంరాజు గారి అంత్యక్రియలు..

అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కృష్ణంరాజు గారు మరణించారు. కృష్ణంరాజు గారి పార్ధివదేహాన్ని మొయినాబాద్ మండలం కనకమామిడిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు కోసం తీసుకువెళ్లారు. ఇక మధ్యాహ్నం గం. 3:30 సమయంలో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు ముగిసాయి. క్షత్రియ సంప్రదాయ పద్దతిలో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరగా..

Krishnam Raju's Last rites ended in Kshatriya Tradition

Krishnam Raju: గంభీరమైన ఆహార్యం, మాటలో రాజసం, నటనలో వైవిధ్యం.. ఇదే కృష్ణంరాజు గారు అంటే. అందుకనే తెలుగు ప్రేక్షకులు ఆయనని మరో పేరు పెట్టి పిలుచుకుంటారు. రెబల్ స్టార్.. అంటూ పిలిపించుకునే కృష్ణం రాజు గారు ఇక లేరు అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి టాలీవుడ్ చుట్టూ విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కృష్ణంరాజు గారు మరణించారు.

Krishnam Raju Last Rites : కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం.. అంత్యక్రియలు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతులమీదుగా..

కృష్ణంరాజు గారి పార్ధివదేహాన్ని అంతిమయాత్రగా జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద నుంచి మొయినాబాద్ మండలం కనకమామిడిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు కోసం తీసుకువెళ్లారు. అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు. ఇక మధ్యాహ్నం గం. 3:30 సమయంలో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు ముగిసాయి.

క్షత్రియ సంప్రదాయ పద్దతిలో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరగా.. ప్రభాస్ అన్న ప్రభోద్ తలకొరివి పెట్టడంతో ముగిశాయి. అయన ఇక మన మధ్య ఉండరు అనే వేదనతో కుటుంబ సభ్యుల బోరున విలపిస్తూ ఆయనకి వీడుకోలు పలికారు. కృష్ణంరాజు గారికి తుది వీడుకోలు పలికేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా అంత్యక్రియలు హాజరయ్యారు.