Kriti Sanon post on her birthday is about Relationship with Prabhas
Kriti Sanon : బాలీవుడ్ భామ కృతి సనన్ టాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హిందీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ వస్తుంది. ఇటీవల ఈ భామ ప్రభాస్ (Prabhas) తో కలిసి ఆదిపురుష్ (Adipurush) సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సమయంలో టాలీవుడ్ టు బాలీవుడ్ వీరిద్దరి ప్రేమ రూమర్లు ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన కొన్ని కామెంట్స్ వీరిద్దరి ప్రేమ వార్తలకి బలం అయ్యాయి. అయితే తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని ప్రభాస్ అండ్ కృతి ఇద్దరు బహిరంగంగా చెప్పేశారు.
Tillu Square : ‘టికెట్ కొనకుండా’నే షో వేసేసిన టిల్లు.. మొదటి సాంగ్ వచ్చేసింది..
అయినాసరి అభిమానుల్లో మాత్రం ఎక్కడో చిన్న డౌట్ అలా ఉండి పోయింది. ఆదిపురుష్ రిలీజ్ సమయంలో ప్రభాస్ అండ్ కృతి మధ్య బాండింగ్ కి సంబంధించిన కొన్ని వీడియోలను స్పెషల్ గా కట్ చేసి అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అయితే తాజాగా కృతి చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. “ఈ ఏడాది నా బర్త్ డేని ఒక ప్రత్యేక వ్యక్తితో షేర్ చేసుకోబోతున్నా. ఈ సీక్రెట్‌ని ఒక సంవత్సరం నుంచి మీ నుంచి దాచి ఉంచాను. ఇక వెయిటింగ్ లేదు” అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు ఒక చిన్న వీడియో కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ‘H’ అనే పదాన్ని చూపించింది.
Ram Charan : రామ్ చరణ్ కూతురు ఎవరి పోలికో చెప్పిన తేజ్.. కళ్ళు చాలా బాగున్నాయి..
ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజెన్స్.. ప్రభాస్ గురించేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది తను హీరోపంతి 2 (Heropanti 2) మూవీ గురించి అనుకుంటా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఒక నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించింది. ఆ నిర్మాణ సంస్థలో వచ్చే మొదటి పోజెక్టు గురించి కూడా ఈ పోస్ట్ వేసి ఉండొచ్చు. కాగా కృతి బర్త్ డే రేపు జులై 27. మరి ఈ భామ రేపు ఎటువంటి సర్‌ప్రైజ్ ఇస్తుందో చూడాలి.
I’m gonna be sharing my birthday with someone special! ?
I’ve kept this secret from you guys for too long! It’s been a year and I can’t wait for you all to see what I’ve been working on.
Any Guesses??#StayTuned pic.twitter.com/MbPzA15hve— Kriti Sanon (@kritisanon) July 26, 2023