Shraddha Kapoor : బాబోయ్.. శ్ర‌ద్దాక‌పూర్‌కి లేడీ ఫ్యాన్ ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చిందో చూడండి.. వీడియో వైరల్..

lady fan gifts to Shraddha Kapoor

Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. హిందీలో వరుస సినిమాలు చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ కేవలం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.  ఇక ఈ మధ్య కాలంలో స్త్రీ 2 సినిమాతో ఈ బ్యూటీ భారీ స‌క్సెస్ అందుకుంది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సైతం రాబ‌ట్టింది.

Also Read : Anasuya Bharadwaj : చీరకట్టులో క్యూట్ గా అనసూయ.. బిగ్ బాస్‌లో నాగార్జునతో కలిసి.. ఫొటోలు చూశారా?

అయితే తాజాగా ఈ భామ ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. ఎయిర్ పోర్టు నుండి బయటికి వస్తున్న సమయంలో  ఓ మ‌హిళ అభిమాని తన వ‌ద్ద‌కు వ‌చ్చి ఫోటోలు తీసుకుంది. అనంతరం ఎంతో ప్రేమతో శ్రద్ధా కపూర్ కి దీపావళి కానుకగా గిఫ్ట్స్, ఫోటో ఫ్రేమ్స్ అందించింది. లేడీ ఫ్యాన్ నుండి బహుమతులు అందుకున్న శ్రద్ధా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆమెకి హగ్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఇక శ్రద్ధా కపూర్ సినిమాల విషయానికొస్తే.. స్త్రీ 2 తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. త్వరలోనే స్త్రీ 3 చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు అప్డేట్ కూడా తనే ఇచ్చింది.