Lavanya Tripathi
Lavanya Tripathi: ఫస్ట్ ఫిల్మ్ ‘అందాలరాక్షసి’ తో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. వరుస సినిమాలతో చక్కని క్యారెక్టర్లతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ లో డీ గ్లామర్ రోల్‌లో అలరించింది. ప్రస్తుత పరిస్థితుల వల్ల సినిమాలకి చిన్న బ్రేక్ ఇచ్చింది లావణ్య.
ఈ బ్రేక్ టైం లో అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి కథలు వింటూ, తన మనసుకి నచ్చినట్లు హ్యాపీగా గడుపుతోంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంటుంది లావణ్య. రీసెంట్‌గా ఇన్‌స్టా లైవ్‌లో తనో రేర్ డిసీజ్‌తో బాధ పడుతున్నట్లు చెప్పడంతో నెటిజన్లు షాక్ అయ్యారు.
Heroine Lavanya Tripathi : లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం
సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి ఇష్ట పడరు కానీ లావణ్య ధైర్యంగా చెప్పేసింది. ‘నాకు ట్రిపోఫోబియా (Trypophobia) ఉంది. కొన్ని ఆకారాలు, వస్తువులను చూస్తే.. తెలియకుండానే నాలో భయం కలుగుతుంది. ఈ ప్రాబ్లమ్ నుండి బయటపడడానికి చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను. మనం హ్యాపీగా ఉంటేనే ఇతరులను హ్యాపీగా ఉంచగలం.. మన పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుందనేది అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం’ అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.