Sathi Leelavathi : మెగా కోడలు లావణ్య కొత్త సినిమా.. ‘సతీ లీలావతి’ టీజర్ రిలీజ్..

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం స‌తీ లీలావ‌తి.

Lavanya Tripathi Sathi Leelavathi Teaser out now

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం స‌తీ లీలావ‌తి. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌ఎంఎస్ ఫేమ్ తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో ఈచిత్రం తెర‌కెక్కుతోంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ ఈ చిత్రంలో చూపించ‌నున్నారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. లావణ్య, దేవ్ మోహన్ జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుంది. అయితే.. ఏమైందో తెలియ‌దు గానీ.. దేవ్ మోన్‌ను లావణ్య కొట్టి కట్టేసుంటుంది. మొత్తంగా టీజ‌ర్ న‌వ్వులు పంచుతోంది.

Anushka Shetty : స్వీటీ యాక్టింగ్‌కు దూరంగా ఉండాలనుకుంటుందా..?

ఇక భార్య భర్తల మధ్య జరిగే గొడవలో వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, జాఫర్, మొట్ట రాజేంద్రన్ ఎందకు ఇన్ వాల్వ్ అయ్యారు? అసలు గొడవేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.