Lavanya Tripathi: తల్లైన తరువాత విడుదలైన మొదటి సినిమా.. తనల్ మూవీపై లావణ్య రియాక్షన్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం(Lavanya Tripathi) తెలిసిందే. వారసుడి రాకతో మెగా ఫ్యామిలీ సంబరాలు అంబరాన్ని అంటాయి.

Lavanya Tripathi's first reaction to the movie Thanal

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వారసుడి రాకతో మెగా ఫ్యామిలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. తమ ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త ప్రపంచానికి స్వాగతం చెప్తూ కుటంబ సభ్యులు ఫోటోలు షేర్ చేశారు. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కొణిదెలవారి ఇంట్లోకి మరో వారసుడు వచ్చాడు అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, లావణ్య త్రిపాఠి నటించిన తనల్ అనే తమిళ సినిమా నేడు(సెప్టెంబర్ 12) విడుదల అయ్యింది.

Karishma Sharma: ఫ్రెండ్స్ రాలేదని ట్రైన్ నుంచి దూకేసిన నటి.. తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చేరిక

తాను తల్లి అయ్యాక విడుదల అవుతున్న సినిమా కావడంతో లావణ్య(Lavanya Tripathi) ఈ సినిమా గురించి మాట్లాడారు. “తణల్‌ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమా చూసినవారందరూ నా నటనను ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సినిమా ప్రథమార్థం రొమాంటిక్‌ గాను, రెండవ భాగం ఎమోషనల్ సీన్స్ తో సాగుతుంది. నా పాత్ర కూడా కథకు చాలా కీలకంగా ఉంటుంది. అంతమంచి పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు రవీంద్ర మాధవకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే హీరో అధర్వతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.