వదిలేలా లేదుగా: రాజకీయ నాయకుడిపై పూనమ్ కౌర్ కామెంట్లు

  • Publish Date - October 29, 2019 / 08:01 AM IST

టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అనుభవించిన హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు. తరచూ సోషల్ మీడియాలో కామెంట్లతో వార్తల్లో నిలిచే ఈ అమ్మడు.. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌లపై ట్వీట్లు చేసి పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. అయితే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే ఎన్నికలకు ముందు మీడియా సమావేశం పెడుతుంది అంటూ చెప్పినా చివరకు అటువంటిదేం జరగలేదు.

అయితే ఎవరి మీదో స్పష్టంగా తెలియదు కానీ, ఛాన్స్ దొరికితే ఎటాక్ చేసేస్తుంది పూనం కౌర్. కత్తి మహేష్ విషయం జరిగేప్పుడు కూడా తర్వాత ఎవరి మీదనో గురి పెట్టిన పూనమ్ తర్వాతి కాలంలో సైలెంట్ అయిపోయింది. తర్వాత కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల వివాదంలో కత్తి మహేష్ పూనమ్ కౌర్ ప్రస్తావన తీసుకుని వచ్చాడు. అయితే లేటెస్ట్‌గా మళ్లీ పూనమ్ కౌర్ ఓ ట్వీట్ ఇన్ డైరెక్ట్‌గా రాజీకీయ నాయకుడిని ఉద్దేశించి పోస్ట్ చేసింది.

”ఓ అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కాగలడు కాని లీడర్ కాలేడు” అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఎవరి గురించి చేసింది అన్నది ఆమె ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ ఆమె ట్వీట్ పైన మాత్రం పలువురు ఘాటుగానే స్పందిస్తున్నారు. పూనమ్ కౌర్ అసలు వదిలేలా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఎవరి గురించి పోస్ట్ చేస్తుందో కొందరికి అర్థం అయినా మరికొందరికి కాకపోయినా సదరు వ్యక్తులను మాత్రం పూనమ్ వదలట్లేదనేది అందరి అభిప్రాయం.